లకావత్ నరసింహ నాయక్.. బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు
నవతెలంగాణ- గోవిందరావుపేట
బీఆర్ఎస్ పార్టీ గెలుపును ఓర్వలేక మా నాయకుడు దుర్గం రమణయ్య తాడువాయి మండలం ఆత్మ కమిటీ చైర్మన్ కాంగ్రెస్ నాయకులు దాడి చేయడం చాలా హీనమైన చర్య అని బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు లాకావత్ నరసింహ నాయక్ అన్నారు. శనివారం మండల కేంద్రంలో నరసింహ మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ గెలుపును తట్టుకోలేక ఈ రకమైన భౌతిక దాడి చేయడం సరైనపద్ధతి కాదు అలాగే గడ్డివాము తగలబెట్టి మూగజీవుల మరణానికి కారణమైన వారు శిక్షార్హులు చాతనైతే ప్రజాక్షేత్రంలో పోరాడి గెలుపొందాలి కానీ ఇలా మనిషిపై అఘాయిత్యం చేయడం సిగ్గుచేటన్నారు.
ప్రజా క్షేత్రంలో గెలుపు -ఓటములు అనేవి సహజంగా ఉంటాయి గెలవడానికి ప్రజల మద్దతు, ప్రజల యొక్క ఆశీర్వాదం ఉంటే గెలుస్తాం, అంతేకానీ ఓడిపోయామని హక్కుసతో ఈ రకం బీఆర్ఎస్ పార్టీ నాయకులపై భౌతిక దాడులు చేయడం సరైన చర్యకాదు.. రెండున్నర సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పాలనలో రాష్ట్రమంతా తీవ్ర నిర్బంధం అమలవుతున్నది. అన్ని వర్గాలపై అణచివేత పెరిగింది. ప్రభుత్వాన్ని ఎవరు ప్రశ్నించినా కేసులు నిత్యకృత్యం అయ్యాయి. ప్రభుత్వ పెద్దల్లో పెరుగుతున్న అసహనానికి పెరుగుతున్న కేసుల సంఖ్యే ఉదాహరణగా నిలుస్తున్నది.ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు.
సస్పెండ్ అనేది తొందరపాటు చర్య
బీఆర్ఎస్ నాయకులను సస్పెండ్ చేస్తున్నట్లు మాలోత్ గాంధీ చేసిన ప్రకటన సరేంది కాదని నరసింహ నాయక్ అన్నారు. సస్పెన్షన్ పై నిర్ణయం జిల్లా పార్టీ ఇంచార్జి నాయకులకు ఉంటుందని అన్నారు. గాంధీ సర్పంచిగా గెలిచినందున తాత్కాలిక గ్రామ కమిటీ అధ్యక్షునిగా అజ్మీర బిక్కు నాయక్ ను నియమిస్తున్నామని అన్నారు.



