Tuesday, October 7, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంజస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌పై దాడి అనాగరికం

జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌పై దాడి అనాగరికం

- Advertisement -

మాజీ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బిఆర్‌ గవాయ్‌పై జరిగిన దాడిని మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ దాడి అనాగరికమని సోమవారం ఒక ప్రకటనలో విమర్శించారు. సుప్రీం కోర్టు హాల్‌లో వాదనల సందర్భంగా రాజేశ్‌కిషోర్‌ అనే న్యాయవాది బూటును గవారుపైకి విసిరి దాడి చేయడం, బెదిరింపులకు పాల్పడటం న్యాయవాద వృత్తిలో ఉండి రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు పూనుకోవడం క్షమించరాని నేరమని తెలిపారు. సనాతన ధర్మాన్ని కించపరుస్తున్నారనే అజ్ఞానపు ఆలోచనతో ఈ దాడికి దిగడం అనాగరికమనీ, అవివేకమని పేర్కొన్నారు. దాడికి పాల్పడిన న్యాయవాదిని కోర్టునుంచి సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -