ఆవాజ్ రాష్ట్ర అధ్యక్షులు ఎండి జబ్బార్ కార్యదర్శి అబ్బాస్
నవతెలంగాణ – వనపర్తి
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ పైకి న్యాయవాది ముసుగులో ఉన్న మతోన్మాది రాకేష్ కిషోర్ దాస్ చెప్పు విసిరి దాడికి పాల్పడడం అత్యంత హేయమైన చర్య అని, ఈ ఘటన దేశానికి అవమానం అని ఆవాజ్ రాష్ట్ర అధ్యక్షులు ఎం.డి జబ్బార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అబ్బాస్ లు శుక్రవారం ఒక సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. ఆ ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ ఆవాజ్ తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నదని పేర్కొన్నారు. దాడికి పాల్పడిన రాకేష్ కిషోర్ ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ దాడి అత్యంత హేయమైనదని, న్యాయవ్యవస్థకు, దేశానికి అవమానం, ఈ దాడి భావ ప్రకటన స్వేచ్ఛ, రాజ్యాంగంపై దాడి అని ఆవాజ్ రాష్ట్ర కమిటీ విమర్శించిందని పేర్కొన్నారు. చీఫ్ జస్టిస్ గవాయ్ పై దాడి దేశంలో విస్తరిస్తున్న విద్వేష విష సంస్కృతి పరాకాష్టకు చేరుకుందనేందుకు నిదర్శనం అని తెలిపారు.
తమ భావజాలానికి అనుగుణంగా తీర్పులు రావాలని, దానికి భిన్నంగా తీర్పు ఇస్తే సహించలేని అసహనం పెరిగిపోతోందని పేర్కొన్నారు. ఈ దోరణి దేశానికి చాలా ప్రమాదకరం, మతోన్మాదం గాంధీని బలిగొన్నదని విచారం వ్యక్తం చేశారు. మతోన్మాదం తలకెక్కిన రాకేశ్ కిషోర్ దేశ అత్యున్నత న్యాయస్థానంలోనే ప్రధాన న్యాయమూర్తి పై దాడికి తెగబడటం దేశ చరిత్రలోనే చీకటి రోజుగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ దాడిని ప్రజలు, ప్రజాస్వామిక వాదులు ముక్తకంఠంతో ఖండించాలని విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు.
సుప్రీం చీఫ్ గవాయ్ పై దాడి అత్యంత హేయం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES