– దళిత యువకునిపై దాడి అమానుషం : సీపీఐ(ఎం) సిద్దిపేట జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి
– ఎల్లదాసునగర్ నుంచి చేర్యాల వరకు బైక్ ర్యాలీ
నవతెలంగాణ-చేర్యాల
మతోన్మాదుల ఆగడాలను అరికట్టాలని, దళిత యువకునిపై దాడి చేయడం అమానుషమని సీపీఐ(ఎం) సిద్దిపేట జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ఎల్లదాసునగర్లోని బాధితుడు ఊబిది అజరు ఇంటికి సోమవారం సీపీఐ(ఎం) బృందం వెళ్లి పరామర్శిం చింది. బాధితునితో మాట్లాడి ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ధైర్యం చెప్పి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అక్కడి నుంచి మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళ్లర్పించారు. అనంతరం అక్కడ నిర్వహించిన సభలో మల్లారెడ్డి మాట్లాడుతూ.. బేడ బుడగ జంగాల దళిత యువకున్ని మతోన్మాద బీజేపీ, ఆర్ఎస్ఎస్, హిందుత్వ బజరంగ్దళ్ ముసుగులో ఉన్న ఉన్మాదులు మానవత్వాన్ని మరిచి విచక్షణారహితంగా దాడికి పాల్పడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, ప్రజాస్వా మ్యానికి విరుద్ధంగా ప్రవర్తించిన ఈ దుండగుల పైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మైనార్టీ ప్రజల మీద, దళితులపైన అర్ధరహితమైన దాడులు చేస్తూ.. ప్రజలను రెచ్చగొట్టి మతకల్లోలాలను సృష్టించి అధికారాన్ని హస్తగతం చేసుకోవడమే బీజేపీ, దాని అనుబంధ ఆర్ఎస్ఎస్, బజరంగ్దళ్, విశ్వహిందూ పరిషత్ లాంటి సంస్థల ఉద్దేశమన్నారు. అందుకు చేర్యాల ప్రాంతంలో జరిగిన ఘటననే నిదర్శనమన్నారు. ఒక దళితుడిని పావుగా ఎంచుకొని ‘భారత్ మాతాకీ జై, జై శ్రీరామ్’ అని నినాదాలు చేస్తూ ఆ యువకున్ని తాళ్లతో కట్టేసి చితకబాది బట్టలూడదీసి నగంగా ప్రదర్శన చేయించడం దుర్మార్గమన్నారు. దీన్ని మేధావులు, ప్రగతిశీల వాదులు ఖండించాలన్నారు. కాగా దుండగులకు బెయిల్ మంజూరు చేయడం సరికాదని, ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు పునరాలోచన చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాళ్లబండి శశిధర్, శెట్టిపల్లి సత్తిరెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు కొంగరి వెంకట మావో, అమ్ముల బాల నరసయ్య, ఆలేటి యాదగిరి, చొప్పరి రవికుమార్, తాడూరి ప్రశాంత్, అత్తిని శారద చేర్యాల పట్టణ కార్యదర్శి రాళ్లబండి నాగరాజు, దూల్మిట పార్టీ మండల కార్యదర్శి పోరెడ్డి రాజు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మతోన్మాదుల ఆగడాలను అరికట్టాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES