Wednesday, April 1, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంగడ్డిమందుపై నిషేధóం హర్షణీయం

గడ్డిమందుపై నిషేధóం హర్షణీయం

- Advertisement -

రైతు కమిషన్‌ చైర్మెన్‌ కోదండరెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

పారక్వాట్‌ గడ్డి మందును నిషేదిస్తూ అసెంబ్లీ తీర్మానం చేయడం హర్షణీయమని రైతు కమిషన్‌ చైర్మెన్‌ కోదండరెడ్డి తెలిపారు. అత్యంత విషపూరితమైన పారక్వాట్‌ వల్ల వందలాది మంది తెలంగాణ రైతుల ప్రాణాలు పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని బీఆర్‌కే భవన్‌లో గల రైతు కమిషన్‌ కార్యాలయంలో వ్యవసాయ అధికారులతో కమిషన్‌ సమావేశమైంది. ఈ సందర్భంగా కోదండరెడ్డి మాట్లాడుతూ..గడ్ది మందు, కలుపు మందు నిషేదించాలని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ వాళ్లు, రైతు సంఘాల నేతలు రైతు కమిషన్‌ దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా సానుకూల నిర్ణయం తీసుకున్నదన్నారు. రాష్ట్రంలో గడ్డి మందు నిషేదించడంతో పాటు దేశంలో కూడా నిషేధించడానికి కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయాలని కోరారు. అమెజాన్‌లో కూడా ఆ మందు అందుబాటులో ఉండటంపై సీరియస్‌ అయ్యారు. విషపూరితమైన గడ్డి మందును అమెజాన్‌ ఎట్లా సరఫరా చేస్తుందని ప్రశ్నించారు. అమెజాన్‌కు గడ్డి మందు విషయంపై నోటీసులు ఇవ్వాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. రైతుల్లో భూసార పరీక్షపై మరింత అవగాహన కల్పించాలనీ, నేలకు తగ్గట్టుగా రైతులు పంటలను సాగుచేసేలా చూడాలని సూచించారు. పంటల మార్పిడి విధానంపై కూడా రైతుల్లో అవగాహన కల్పించాలన్నారు. ఈ సమావేశంలో రైతు కమిషన్‌ సభ్యులు గోపాల్‌రెడ్డి, భవానీ రెడ్డి, కెవిఎన్‌రెడ్డి, మెంబర్‌ సెక్రెటరీ గోపాల్‌, వ్యవసాయ శాఖ అధికారులు గీతారెడ్డి, సుచరిత, శ్రీధర్‌తోపాటు కమిషన్‌ అధికారులు సంధ్యారాణి, హరి, స్రవంతి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -