- Advertisement -
సీపీఐ ఆదేశాలు మేరకు ఏఐవైఎఫ్ నిర్వహణ…
నవతెలంగాణ – అశ్వారావుపేట
విద్యారంగం ఎదుర్కొంటున్న సమస్యలు పై ఏఐఎస్ఎఫ్ పిలుపు మేరకు విద్యా సంస్థల రాష్ట్ర వ్యాప్త బంద్ లో భాగంగా అశ్వారావుపేట పలు పాఠశాలలు బంద్ పాటించాయి. సీపీఐ మండల సమితి అదేశానుసారం దాని అనుబంధ ఏఐవైఎఫ్ కార్యకర్తలు పాఠశాలలకు వెళ్ళి బంద్ చేయాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకులు ఎస్డీ జాకీర్,ఎస్కే అబ్బాస్,నూకారపు విజయ్ కాంత్ లు పాల్గొన్నారు.
- Advertisement -