ఎస్‌ఎఫ్‌ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకుల విద్యాలయాల్లో చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకుల విద్యార్థులకు కాస్మొటిక్ చార్జీల విడుదలకు బ్యాంకు ఖాతా షరతను వెనక్కి తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు ఎస్.రజనీకాంత్, రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు ఒక ప్రకటన విడుదల చేశారు. గతంలో విద్యార్థులకు నేరుగా అందజేసే విధానంలో సకాలంలో అందేవని తెలిపారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక బ్యాంకు ఖాతా ఉంటేనే జమ చేస్తామని షరతు విధించడంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదని చెప్పారు.
ఆధార్ కార్డులు, అకౌంట్స్ లేని విద్యార్థులు చాలా మంది ఉన్నారనీ, వీరికి కాస్మొటిక్ చార్జీలు అందే అవకాశం లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యా సంవత్సరం మధ్యలో ఇలాంటి నిబంధన తీసుకురావడంతో విద్యార్థులు నష్టపోయే అవకాశముందని హెచ్చరించారు. ఆ నిధులు డిపార్ట్ మెంట్‌లోనే మిగిలిపోయే ప్రమాదముందన్నారు. ఈ ఏడాది బ్యాంక్ ఖాతా ఉంటేనే కాస్మొటిక్ ఛార్జీలు ఇస్తామనే నిబంధనను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనలు చేస్తామని వారు హెచ్చరించారు.
కాస్మోటిక్ ఛార్జీల విడుదలకు బ్యాంకు ఖాతా షరతను వెనక్కి తీసుకోవాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



