Thursday, May 29, 2025
Homeక్రైమ్బార్‌లో గొడవ..ఆపేందుకు యత్నించిన యువకుడు మృతి

బార్‌లో గొడవ..ఆపేందుకు యత్నించిన యువకుడు మృతి

- Advertisement -

– బీర్‌ బాటిల్‌తో తలపై కొట్టిన స్నేహితుడు
– రోడ్డు ప్రమాదంలో పెద్ద కొడుకు.. స్నేహితుని దాడిలో చిన్న కొడుకు మృతి
– తల్లిదండ్రుల రోదన వర్ణనాతీతం
నవతెలంగాణ-ఉప్పల్‌

గతంలోనే రోడ్డు ప్రమాదంలో పెద్ద కొడుకు దూరమయ్యాడు. ఉన్న చిన్న కొడుకుపైనే ఆ తల్లిదండ్రులు ప్రాణం పెట్టుకున్నారు. కానీ, బార్‌లో మద్యం మత్తులో స్నేహితుల మధ్య జరిగిన గొడవను ఆపేందుకు వెళ్లి ఆ కొడుకూ ప్రాణం కోల్పోవడంతో తల్లిదండ్రుల రోదన వర్ణనాతీతంగా మారింది. ఈ ఘటన మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా ఉప్పల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్‌కర్నూల్‌ జిల్లా తిమ్మాజిపేట మండలం చేగుంట గ్రామానికి చెందిన కుమ్మరి భాస్కర్‌- శ్రీమాత దంపతులు హైదరాబాద్‌ అంబర ్‌పేటలోని బాబు నగర్‌లో నివాసం ఉంటున్నారు. భాస్కర్‌ క్యాబ్‌ డ్రైవర్‌గా పనిచేస్తు న్నాడు. దంపతులకు ఇద్దరు కుమారులు కాగా, పెద్ద కుమారుడు ప్రవీణ్‌ నాలుగేండ్ల కిందట రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. రెండో కొడుకు పవన్‌ కుమార్‌(25)పైనే వారు ప్రాణం పెట్టుకున్నారు. అయితే, పవన్‌ ఆదివారం రాత్రి తన స్నేహితులైన హరి, శ్రవణ్‌, మరో స్నేహితుడితో కలిసి 11 గంటల సమయంలో రామంతపూర్‌లోని గుడ్‌ డే బార్‌కు వెళ్లాడు. హరి, పవన్‌ కుమార్‌ ఓ బెంచ్‌లో, శ్రవణ్‌ మరో స్నేహితుడు కలిసి ఇంకో బెంచ్‌లో కూర్చున్నారు. మద్యం తాగాక హరి, శ్రవణ్‌ మధ్య గొడవ జరిగింది. వారిని ఆపడానికి ప్రయత్నించిన పవన్‌ కుమార్‌ తలపై శ్రవణ్‌ బీర్‌ బాటి ల్‌తో కొట్టాడు. దాంతో పవన్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసు కున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతద ేహాన్ని గాంధీ మార్చు రీకి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నా రు. ఇప్పటికే ఓ కొడుకు రోడ్డు ప్రమాదంలో మృతిచెం దగా.. ఉన్న ఒక్కగా నొక్క కొడుకు కూడా ఇప్పుడు చనిపోవడంతో తల్లిదం డ్రులు గుండెల విసేలా రోదిస్తున్నారు. బార్‌ యజమాన్యం, సిబ్బంది వెంటనే స్పందించి ఉంటే తమ కుమారుడు బతికే వాడని మృతుని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -