Sunday, April 5, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్క్షౌర వృత్తిపై పేటెంట్ హక్కు ఇవ్వాలి

క్షౌర వృత్తిపై పేటెంట్ హక్కు ఇవ్వాలి

- Advertisement -

-నాయి బ్రాహ్మణుల సమస్యలు పరిష్కరించాలి…
-నాయి బ్రాహ్మణ  నాయకులు యాదగిరి నాయి..
నవతెలంగాణ – సుల్తాన్ బజార్ 

నాయి బ్రాహ్మణులకు సబ్సిడీ రుణాలు అందించాలని, కార్పొరేట్ వ్యవస్థను కట్టడి చేసేలా ప్రభుత్వం తమకు క్షౌరవృత్తి పై పేటెంట్ హక్కు కల్పించేలా చట్టం తీసుకురావాలని నాయి బ్రాహ్మణ సంఘం సీనియర్ నాయకుడు యాదగిరి నాయి ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ…నాయి బ్రాహ్మణులు సామాజికంగా, ఆర్థికంగా వృత్తిపరంగా వివిధ రకాలుగా సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు. 

కార్పొరేట్ శైలి సెలూన్‌, ఆధునిక కార్పొరేట్ హెయిర్ సెలూన్‌లు పెరిగిపోవడంతో, సాంప్రదాయ చిన్న సెలూన్‌లు నడుపుకునే పరిస్థితి లేదన్నారు. నాయి బ్రాహ్మణుల ఆదాయం బాగా తగ్గిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నామన్నారు. తమ వాళ్ళలోచాలామంది సాంప్రదాయ పద్ధతిలో చిన్న దుకాణాలు నిర్వహిస్తుంటారని. ఆధునిక పరికరాలు కొనుగోలు చేయడానికి, దుకాణాలను ఆధునీకరించడానికి అవసరమైన పెట్టుబడి లేకపోవడం తో ఇబ్బందులు పడుతున్నామన్నారు ప్రభుత్వం. తమకు ఆర్థిక సాయం అందించాలని కోరారు.

సామాజిక వివక్ష ఇప్పటికీ కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో కుల వివక్ష, అంటరానితనం వంటి అంశాలు వృత్తిపరమైన జీవన ప్రమాణాలను దెబ్బతీస్తున్నాయి అని వాపోయారు.వృత్తిపరమైన ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్నాయని తెలిపారు.రోజంతా నిలబడి పనిచేయడం, కత్తెరలు, రేజర్లతో నిరంతరం పనిచేయడం వల్ల నడుము నొప్పి, కళ్ల సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందని తెలిపారు‌ ప్రభుత్వం హెల్త్ కార్డు మంజూరు చేయాలని కోరారు.

వృత్తి మార్పులు ,కొత్త తరం యువత ఈ వృత్తిని కొనసాగించడానికి ఆసక్తి చూపడం లేదన్నారు. ఇతర ఉద్యోగాల వైపు వెళ్లడం వల్ల వృత్తిపరమైన వారసత్వం తగ్గుతోంది ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వ గుర్తింపు, ఆర్థికసహాయం (రుణాలు)నాయి బ్రాహ్మణులకు చట్టపరమైన గుర్తింపు,  వృత్తిపరమైన ఆధునీకరణకు ప్రభుత్వ పథకాలు సరిగ్గా అందడం లేదన్నారు. 

ఈ సమస్యల పరిష్కారం కోసం నాయి బ్రాహ్మణ సంఘాల ను కలుపుకొని పోయి  ప్రభుత్వాన్ని మారుతున్న కాలానికి అనుగుణంగా వృత్తిలో శిక్షణ తరగతులు,సబ్సిడీ ఋణాలు, ఉచిత విద్యుత్ బకాయిల మాఫీ, ఉచిత విద్యుత్ అమలు, ఆధునిక సలూన్‌ల ఏర్పాటుకు ఆర్థిక సహాయం కోరడానికి త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తామని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -