స్లీపింగ్‌మోడ్‌లో బీఆర్‌ఎస్ పార్టీ
సిద్దిపేటలో రేవంత్‌రెడ్డి, గుంట నక్క మధ్య ఒప్పందం
సిద్దిపేట మాత్రమే కాదు గజ్వేల్ మహిళలకు రిజర్వు అయినా పోటీ చేస్తా : కల్వకుంట్ల కవిత
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తమ ప్రథమ శత్రువు కాంగ్రెస్ పార్టీనే అనీ, ఆ పార్టీపైనే తమ పోరాటమని తెలంగాణ జాగృతి అధ్యక్షులు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఆమె మీడియాతో చిట్ చాట్ చేశారు. బీఆర్‌ఎస్ పార్టీ ప్రస్తుతం స్లీపింగ్ మూడ్‌లో ఉందనీ, తనకు ప్రకృతి అనుకూలంగా ఉందని చెప్పారు. ఆ పార్టీ దగ్గర ఉన్నన్ని డబ్బులు తమ దగ్గర లేవని చెప్పారు. సిద్దిపేట, గజ్వేల్‌లో ఏది మహిళలకు రిజర్వు అయితే అక్కడ నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. సిద్దిపేటలో రేవంత్‌రెడ్డి, గుంట నక్క మధ్య ఒప్పందం ఉందని తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు. ఫ్యూచర్ సిటీపేరుతో హైదరాబాద్‌ను రేవంత్‌రెడ్డి ఆగం చేస్తున్నాడని విమర్శించారు. పార్టీ ఆవిర్భావ వేదికపై ఎజెండా ప్రకటిస్తామనీ, ఆ వేదికపై ఉద్యమకారులు ఉంటారని తెలిపారు. పార్టీ ఆవిర్భావ సభకు ఇతర పార్టీల నేతలను ఆహ్వానించడం లేదన్నారు. విదేశాల్లో ఉన్నవాళ్లు సైతం తమ పార్టీలో చేరుతామని అంటున్నారని తెలిపారు. తమ పార్టీ గ్రామస్థాయి నుంచి పోరాటం చేస్తుందనీ, అదే తనను, పార్టీని నిలబెడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భద్రాచలం మండలం నుంచి విడదీసిన ఐదు గ్రామాల గురించి పార్లమెంట్‌లో ఎందుకు మాట్లాడలేదు? అమరావతి బిల్లు సందర్భంగా భద్రాచలం గురించి తెలంగాణ ఎంపీలు ఎందుకు ప్రశ్నించలేదు? అని నిలదీశారు. గోవాలో 25 వేల ఓట్లకు ఒక్క ఎమ్మెల్యే ఉంటే మన దగ్గర ఏడు లక్షల ఓటర్లకు ఒక ఎమ్మెల్యే ఉన్నారనీ, లక్షద్వీప్, అసోంలో 50 వేల ఓటర్లకు ఒక ఎంపీ ఉంటే తెలంగాణలో 16 లక్షల మందికి ఒక ఎంపీ ఉన్నారని వివరించారు. ఇంత వ్యత్యాసం ఉంటే ఒక్కో రాష్ట్రంలో 50 శాతం సీట్ల పెంపు ఎలా సహేతుకం అవుతుందని ప్రశ్నిం చారు. ఆర్థిక క్రమశిక్షణ పాటించే రాష్ట్రాలకూ నియోజకవర్గాల పునర్వ్యస్థీ కరణలో ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీహార్‌లో రేవంత్‌రెడ్డి ప్రచారం చేయడం వల్లనే కాంగ్రెస్ ఓడిపోయిందనీ, కేరళంలోనూ అదే జరుగబోతున్నదని జోష్యం చెప్పారు. ఆరు గ్యారెంటీల గురించి కేరళం ప్రజలకు రేవంత్‌రెడ్డి చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.
ప్రథమ శత్రువు కాంగ్రెస్‌పైనే పోరాటం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



