బీసీ జెఏసి నాయకుడు జక్కం రాజేందర్
నవతెలంగాణ – మల్హర్ రావు
బీసీ బిల్లును 42 శాతం పార్లమెంట్ లో ఆమోదించాలని బిసి జెఏసి నాయకుడు జక్కం రాజేందర్ డిమాండ్ చేశారు. మండల కేంద్రమైన తాడిచెర్లలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42శాతం రిజర్వేషన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కల్పించాలని కోరారు. బీసీ కులాలకు రాజ్యాధికారం రావాలని త్వరలో బీసీ కుల సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేయాలి ఢిల్లీకి వెళ్లి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేసి పార్లమెంట్ సమావేశంలో అన్ని రాజకీయ పార్టీల ఎంపీల మద్దతు తీసుకొని పార్లమెంట్లో బిల్లు ఆమోదించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. బీసీ బిల్లుకు మద్దతు తెలుపని రాజకీయ పార్టీలు బిసి ద్రోహులుగా మిగిలిపోతారన్నారు. ఈ కార్యక్రమంలో బిసి సంఘం నాయకులు చిగిరి మధు,దశరథి అరవింద్,జాలిగాపు మధు,ఆకుల రమేష్,స్వామి,విక్కీ,వివేక్,చొప్పరి చిన్న ఓదెలు పాల్గొన్నారు.
బీసీ బిల్లును పార్లమెంట్లో బిల్లు ఆమోదించాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



