Friday, October 17, 2025
E-PAPER
Homeజిల్లాలుబీసీల బందును జయప్రదం చేయాలి

బీసీల బందును జయప్రదం చేయాలి

- Advertisement -

సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శులు మల్లు, భావండ్ల
నవతెలంగాణ – మిర్యాలగూడ

42 శాతం బీసీ రిజర్వేషన్ విషయంలో బిజెపి అవలంబిస్తున్న ద్వంద వైఖరినీ నిరసిస్తూ శనివారం తలపెట్టిన తెలంగాణ బందును జయప్రదం చేయాలని సీపీఐ(ఎం) పట్టణ వన్ టౌన్, టూ టౌన్ కార్యదర్శలు డాక్టర్ మల్లు గౌతమ్ రెడ్డి బావాండ్ల పాండు కోరారు. శుక్రవారం స్థానిక సీపీఐ(ఎం) కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడుతూ .. బీసీ రిజర్వేషన్ అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం కావాలని అడ్డుకుంటుందని ఆరోపించారు. అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి సర్వే చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం బీసీ బిల్లు ఆమోదించకుండా కాలయాపన చేస్తుందని విమర్శించారు.

దాని ఫలితంగా ప్రభుత్వం జారీ చేసిన జీవో రద్దు అయిందన్నారు. బిసి రిజర్వేషన్ అమలు విషయంలో తెలంగాణలోని బిజెపి ప్రజా ప్రతినిధులు బాధ్యతగా వహించి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. లేనిపక్షంలో తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బీసీ సంఘాల ఆధ్వర్యంలో తల పట్టిన తెలంగాణ బందుకు సీపీఐ(ఎం) పూర్తి మద్దతు ఇస్తుందని, అందులో భాగంగా మిర్యాలగూడ  పట్టణంలో విద్యా, వ్యాపార, వాణిజ్య, రవాణా రంగాలు మూసి వేసి బందుకు సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో హమాలి వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు తిరుపతి రామ్మూర్తి, నాయకులు దేశిరాం నాయక్, వాడపల్లి రమేష్, గోవర్ధనా, పల్లా బిక్షం,  బ్రహ్మచారి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -