- Advertisement -
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలో భాగంగా మిస్ వరల్డ్-2025 బుధవారం వరంగల్ పర్యటనకు వెళ్తూ మార్గ మధ్యలో భువనగిరి బైపాస్ లో వివేర హోటల్ వి కన్వెన్షన్ కు అందాల భామలు మధ్యాహ్నం చేరుకున్నారు. వారికి తెలంగాణ రాష్ట్ర హోటల్ అసోసియేషన్ అధ్యక్షుడు సద్దివెంకట్ రెడ్డి, వివేర హోటల్ ఎండి రాఘవేంద్ర రెడ్డి, పోలీసు ఉన్నతాధికారులు, రెవెన్యూ అధికారులు స్వాగతం పలికారు. వరంగల్ జిల్లాలోని రామప్ప దేవాలయ సందర్శనకు వెళ్తూ మార్గ మధ్యలో వివేర హోటల్ ప్రత్యేక బోజనాలు ఏర్పాటు చేశారు. మొదటి బ్యాచ్ లో 29 మంది అందాల భామలు హాజరయ్యారు.
- Advertisement -