Friday, September 5, 2025
E-PAPER
spot_img
Homeఖమ్మంఉత్తమ ఉపాధ్యాయులు.. ఈ ఆదర్శ దంపతులు

ఉత్తమ ఉపాధ్యాయులు.. ఈ ఆదర్శ దంపతులు

- Advertisement -

నవతెలంగాణ – అశ్వారావుపేట
నాడు ఒకే వృత్తి, ఒకే సారి నియామకం, ఒకే మండలం వాసులు అనంతరం దంపతులు అయ్యారు. నేడు భర్త జిల్లా స్థాయిలో భార్య మండల స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక కావడం విశేషం. ఇలాంటి సామీప్యత లు అరుదుగా ఉంటాయి. అరుదైన వ్యక్తులు కావడం మరో విశేషం. అశ్వారావుపేట మండలం గాండ్లగూడెం ఎంపీ ఎస్ ఎల్ ఎఫ్ ఎల్ ప్రధానోపాధ్యాయుడు బి.సిద్దు (శ్రీశైలం),ఇదే మండలం నారం వారి గూడెం ఎపీ యూపీఎస్,పీఎం శ్రీ  గణిత ఉపాద్యాయురాలు ఎల్.రేణుక లు ఉపాద్యాయ దంపతులు.

ఈ ఏడాది ఉపాద్యాయ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం ప్రకటించే ఉత్తమ ఉపాద్యాయ అవార్డులకు గాను సిద్దు జిల్లా స్థాయిలో,రేణుక మండల స్థాయిలో ఎంపిక కావడంతో ఉత్తమ ఉపాద్యాయ దంపతులుగా రికార్డ్ సొంతం చేసుకున్నారు. అయితే వీరు ఇరువురికి అనేక సామీప్యతలు ఉండటం మరో విశేషం.

వీరు ఇరువురు అశ్వారావుపేట నియోజక వర్గం చండ్రుగొండ మండలం లో ఇరుగుపొరుగు ఊరు వాళ్ళే.వీరు ఇరువురు ఒకే ఏడాది అంటే 2001 డీఎస్సీ లో ఉపాధ్యాయులుగా ఒకే రోజు నియమితులు అయ్యారు. బి.సిద్దు (శ్రీశైలం)మొదటి పోస్టింగ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లోని వెలేరుపాడు మండలం, ఎంపీ ఎస్ బొల్లాపల్లి. ఇక్కడ 2009 వరకు విధులు నిర్వహించారు.

2009 నుండి 2015 వరకు అశ్వారావుపేట మండలం ఎంపీపీ ఎస్ మద్దికొండ,2015 నుండి 2024 వరకు అన్నపురెడ్డిపల్లి మండలం ఎంపీయూపీఎస్ పెంట్లం, 2024 లో ఎల్ ఎఫ్ ఎల్ ప్రధానోపాధ్యాయుడుగా పదోన్నతి పొంది అశ్వారావుపేట మండలం,గాండ్లగూడెం ఎంపీ పీఎస్ లో ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నారు.

ఎల్.రేణుక మొదటి పోస్టింగ్ వెలేరుపాడు మండలం ఎంపీ పీఎస్ జిన్నెలగూడెం.ఇక్కడ 2009 వరకు విధులు నిర్వహించారు.2009 నుండి 2015 వరకు అశ్వారావుపేట మండలం ఎంపీయూపీఎస్   నారంవారిగూడెం.2015 లో గణితం (ఎస్.ఏ) పదోన్నతి పొంది అన్నపురెడ్డిపల్లి ఎంపీ యూపీఎస్ కు బదిలీ అయ్యారు. తిరిగి 2023 లో నారం వారి గూడెం బదిలీ పై వచ్చి ప్రస్తుతం ఇదే పాఠశాలలో పని చేస్తున్నారు.

వీరికి ఇరువురూ ఆడ సంతానమే.. పెద్దమ్మాయి రుష్మిత దంతవైద్య శాస్త్రం 3 వ సంవత్సరం చదువుతోంది. రెండో కూతురు మొనాలి డేటా సైన్స్ ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతుంది. దీంతో వీరు ఆదర్శ దంపతులు గానూ ఖ్యాతి నొందారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad