Friday, March 27, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్దంపతుల సమస్యలకు రాజీమార్గమే రాజమార్గం

దంపతుల సమస్యలకు రాజీమార్గమే రాజమార్గం

- Advertisement -
  • గోల్కొండ  జోన్ మహిళా పోలీస్ స్టేషన్ ఇన్ స్పెక్టర్ పి వెంకటలక్ష్మి..
  • నవతెలంగాణ – సుల్తాన్ బజార్ 
  • భార్యాభర్తలు తగాదా పడి వచ్చినప్పుడు వారికి సర్ది చెప్పి పరస్పర అవగాహన కల్పించి ప్రేమతో రాజీ కుదర్చడమే ప్రథమ కర్తవ్యంగా కృషి చేస్తున్నా మని గోల్కొండ జోన్ మహిళా పోలీస్ స్టేషన్ ఇన్ స్పెక్టర్ పి వెంకటలక్ష్మి అన్నారు. శుక్రవారం షాయినాథ్ గంజ్ లోని గోల్కొండ జోన్ మహిళా పోలీస్ స్టేషన్ లో మాట్లాడుతూ.. సెంటర్ ఫర్ డెవలప్ మెంట్ ఆఫ్ ఉమెన్ (సి డి ఈ డబ్ల్యూ) ద్వారా భార్యాభర్తలుమ కు కౌన్సిలింగ్ నిర్వహిస్తామన్నారు.

కుటుంబంలో విభేదాలు వస్తే  పెద్దల సమక్షంలో సమస్యలు వివరించి కమ్యూనిటీ స్థాయిలోనే పరిష్కరించుకున్నట్లయితే భార్యా భర్తల బంధం బలపడుతుంది అన్నారు. భార్య భర్తల గొడ వల వల్ల పిల్లలపై చెడు ప్రభావం పడే ప్రమాదం పొంచి ఉందన్నారు. కుటుంబ సభ్యుల మధ్య కమ్యూనికేషన్ మెరుగవుతుందన్నారు. సి డి ఈ డబ్ల్యూ ద్వారా  కౌన్సిలింగ్ నిర్వహించి దంపతుల సమస్యలు పరిష్కారమైతాయి అన్నారు.

భార్యా భర్తల బంధం ప్రేమ నమ్మకం పరస్పర గౌరవం పై ఆధా రపడి ఉంటుందని తెలిపారు. బంధాలు దృఢంగా ఉండ దానికి మంచి అనుబంధం ద్వారా ఒకరినొకరు అండగా నిలబడడం చాలా ముఖ్యమన్నారు. దంపతులు ఒకరి అబి ప్రాయాలు మరొకరు గౌరవించుకుంటూ బలమైన వైవా హిక బంధం కొన సాగిస్తూ ముందుకు సాగాలని సూచిం చారు. చిన్నచిన్న విషయాలకే తగాదాలకు పోకుండా సామరస్యంతో పరిష్కరించుకోవాలని సూచించారు. ఒకరంటే ఒకరికి గౌరవం ఉండాలని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -