– తుమ్మిడి హట్టి పున్ణనిర్మాణం చేపట్టాలి
– కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు భవిషత్తుపై రౌండ్‌టేబుల్‌లో వక్తలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. గురువారం హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో తెలంగాణ జల సాధన సమితి ఆధ్వర్యంలో’ జాతీయ డ్యామ్‌ల భద్రత సంస్థ (ఎన్‌డీఎస్‌ఏ) తుది నివేదిక నేపథ్యంలో కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు భవిష్యత్తు’పై రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ప్రొఫె˜సర్ వినాయకరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో జలసాధన సమితి కన్వీనర్ నైనాల గోవర్ధన్ మాట్లాడుతూ తుమ్మిడి హట్టి నుండి రీ డిజైనింగ్, రీ ఇంజనీరింగ్ పేరిట మేడిగడ్డకు మార్చి భారీ బడ్జెట్‌తో ఎదురు ఎత్తిపోతలు చేపట్టడమే ఉద్దేశపూర్వకమైన అవినీతి కుంభకోణమని విమర్శించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు కుంగిపోయే వరకు జరిగిన ఘోరమైన నిర్లక్ష్యం, తప్పులను ఎన్‌డీఎస్‌ఏ నివేదిక బైటపెట్టిందని తెలిపారు. మేడిగడ్డ మూడు బ్యారేజీల్లో పునరుద్ధరణకు పెట్టే ప్రతి పైసా వృధా ఖర్చని చెప్పారు. తుమ్మిడి హెట్టిని వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రముఖ నీటిపారుదల నిపుణులు పి.జి. శాస్త్రి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ. ఇసుక బెడ్స్ పైన బ్యారేజీలు ప్రాజెక్టులు కట్టడం ఒక ప్రాకృతిక సవాలన్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల, మూడు బ్యారేజీలు ఇసుక బెడ్ పైన కట్టినవేనన్నారు. భూమి అడుగు పునాది లో బండరాయి లేదని చెప్పారు. ప్రతి బ్యారేజ్‌లో రెండున్నర టీఎంసీల కంటే ఎక్కువ నీరు నిలువ చేయకూడదని సూచించారు. రాజకీయ పెద్దల దర్శకత్వంలో ఇంజనీర్లు డమ్మీలై సృష్టించిన వినాశకర విధ్వంసమని ఆవేదన వ్యక్తం చేశారు. హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ 15 నెల్లైనా, ఎన్‌డీఎస్‌ఏ అన్ని నివేదికలు వచ్చినా, అవినీతిపరులను కాంగ్రెస్ పార్టీ ఎందుకు శిక్షించడం లేదని ప్రశ్నించారు. ఈ మూడు బ్యారేజీల పునర్నిర్మాణం పై డబ్బు వృధా చేయకుండా. తుమ్మిడి హట్టి బ్యారేజీని వెంటనే నిర్మించాలని డిమాండ్ చేశారు. సీపీఐ(ఎంఎల్) కేంద్ర కమిటీ సభ్యులు వేములపల్లి వెంకట రామయ్య మాట్లాడుతూ గత ప్రభుత్వ పెద్దలు, అధికారులు చేసిన ఘోరమైన తప్పులను నివేదికలు ఎత్తి చూపినా సంబంధిత బాధ్యులపై ఎందుకు చర్యలు తీసుకోలేదో సమాధానం చెప్పాలని నిలదీశారు. ఎమ్మెల్సీ కోదండరామ్ మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా, కాళేశ్వరం మూడు బ్యారేజీల పేరిట గోదావరిపై ఎదురు ఎత్తిపోతలు నిర్మించడం తీవ్రమైన తప్పని చెప్పారు. లక్ష కోట్ల ప్రజాధనం వృధా చేసిన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ మాజీ సభ్యులు మధు యాష్కి మాట్లాడుతూ కేసీఆర్‌్ ప్రజల ఆస్తులకు ధర్మకర్తగా లేడనీ, దోపిడీదారుగా ఉన్నారని విమర్శించారు. రూ.300 కోట్లు ఒకే అధికారి ధనార్జనకు పాల్పడితే.. ఆ ప్రభుత్వ పెద్దల వద్ద ఎన్ని వేల కోట్ల ధనం ఉందో ఆలోచించాలన్నారు. ఇతర దేశాల్లో అయితే ఉరిశిక్ష వేస్తారని చెప్పారు. సంబంధిత అవినీతిపరులపై కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.మాజీ మంత్రి విజయరామారావు మాట్లాడుతూ దేశం మొత్తంలో, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై జరిగిన చర్చ మరే ప్రాజెక్టులో జరగలేదని చెప్పారు. ఆ ప్రాజెక్టును కేసీఆర్ కల్పతరువుగా చేసుకున్నారన్నారు. కార్యక్రమంలో ప్రాణహిత పరిరక్షణ వేదిక కన్వీనర్ కె.వి.ప్రతాప్ , మాజీ ఇంజనీరు విటల్ రావు, జర్నలిస్ పృధ్విరాజ్, చీఫ్ ఇంజనీర్ జియో ఉద్దీన్, సాంబశివరావు, ఉపేందర్ రెడ్డి, సీపీఐ(ఎంఎల్) కార్యదర్శి ప్రసాద్ ఎంసీపీఐయూ నాయకులు పెద్దారపు రమేష్, ఏఐకేఎంఎస్ నాయకులు కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
కాళేశ్వరం పెద్ద కుంభకోణం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES