నవతెలంగాణ – పెద్దవూర
జాతీయ నాయకుల జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవాలని జాతీయ నాయకుల విగ్రహాలనిర్మాణ వ్యవస్థాపక అధ్యక్షులు పులిమాల కృష్ణారావు అన్నారు. బుధవారం మండల కేంద్రంలోజాతీయ నాయకుల విగ్రహాల ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఏప్రిల్ 5న బాబు జగ్జీవన్ రావు జయంతి, ఏప్రిల్ 11న మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి, ఏప్రిల్ 14న డాక్టర్ అంబేద్కర్ జయంతిని అన్నీ వర్గాల నాయకులు నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు.
మండల కేంద్రంలో ఉన్నటువంటి అన్ని గ్రామ పంచాయతీల సర్పంచులు, ఉపసర్పంచులు, అంబేద్కర్ వాదులు, అభిమానులు పార్టీలకతీతంగా పాల్గొని ఈఉత్సవాలను విజయవంతం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ అధ్యక్షులు బొంగరాల వెంకటేశ్వర్లు,ఉపాధ్యక్షులు దోరేపల్లి మల్లయ్య,యువజన నాయకుడు డాక్టర్ రామకృష్ణ బుడిగపాక లక్ష్మయ్య, నియోజకవర్గ బీసీ నాయకులు బైకానీలక్ష్మయ్య,మాతంగి శ్రీను,పొట్టి పాక వెంకన్న,నేనవత్ లాలు తదితరులు పాల్గొన్నారు.



