– సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు టిఎల్ రవి
నవతెలంగాణ – కన్నాయిగూడెం
కన్నాయిగూడెం మండలం లో గ్రామీణ పేదలకు ఎంతో ఉపయోగకరంగా ఉండే గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని సీపీఐ(ఎం) పార్టీ శాఖ కార్యదర్శి మధు అధ్యక్షతన సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా సీపీఐ(ఎం) పార్టీ జిల్లా కమిటీ సభ్యులు టిఎల్ రవి హాజరై మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకం నిధుల కేటాయింపు కుదించిందని అన్నారు. దేశంలో వామపక్షాల మద్దతుతో యూపీఏ ప్రభుత్వం కోట్లాదిమంది వ్యవసాయ కూలీల ప్రయోజనాల కోసం ఉపాధి హామీ పథకం తీసుకొచ్చిందని తెలిపారు. సంవత్సరానికి ₹ 100 రోజులు పని దినాలు లభిస్తున్నాయని తెలిపారు. గ్రామాల్లో ఈ పథకం ద్వారా ప్రజల కొనుగోలు శక్తి పెరిగిందని తెలిపారు. ఈ పథకాన్ని బిజెపి ప్రభుత్వం బడ్జెట్లో 86 వేల కోట్ల నుండి 60 వేల కోట్లకు కుదించిందని తెలిపారు. అదేవిధంగా కార్పొరేట్ అనుకూల విధానాల అవలంబిస్తూ గ్రామీణ పేదలను విస్మరిస్తుందని విమర్శించారు ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చి దాని జవసత్వాలు లేకుండా చేయడం సబబు కాదని అన్నారు. ఈ విషయంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) పార్టీ మండల నాయకులు కోరం చిరంజీవి,నాయకులు రవితేజ, రాజు, పవన్, భద్రయ్య, చుక్కయ్య తదితరులు పాల్గొన్నారు
ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్న బీజేపీ ప్రభుత్వం…
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


