అభివృద్ధిని అడుగడుగునా అడ్డుకుంటున్నారు : పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అష్టదిగ్బంధనం చేస్తోందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ శాఖ పద్దులపె జరిగిన చర్చ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర బీజేపీ నేతల తీరుపై విమర్శలు గుప్పించారు. పేదలకు ఉపాధి కల్పించే ఉపాధి హామీ చట్టాన్ని కేంద్రం నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. వంద రోజుల నుంచి 125 రోజులకు పని దినాలను పెంచుతున్నామని ప్రకటించి అనేక కొర్రీలు పెట్టిందన్నారు. చట్టం స్కీంగా మారిన తర్వాత కేంద్రం కేటాయించిన నిధుల మేరకే పనుల్ని చేపట్టాలి తప్ప, గ్రామీణ అవసరాల రీత్యా అదనపు పనులు చేయడానికి వీల్లేకుండా నిబంధనల్ని రూపొందించిందని మండిపడ్డారు.
గతంలో ఉన్న 90:10 సగటును 60:40గా మార్చడం వల్ల రాష్ట్రంపై రూ.1,500 కోట్ల భారం పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే మిషన్ భగీరథ పథకానికి రూ.16,100 కోట్ల నిధులు కావాలని పలు మార్లు చేసిన విజ్ఞప్తిని కేంద్రంలోని బీజేపీ సర్కార్ పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రంలోని బీజేపీ నేతలు సైతం అష్ట దిగ్బంధ పాలకుల్లాగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం పథకాలను, అభివృద్ధిని అడ్డుకోవడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. ఎనిమిది మంది బీజేపీ నేతలు కేంద్రంతో మాట్లాడి తెలంగాణకు నిధులు తేవాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రాన్ని అష్టదిగ్బంధనం చేస్తున్న బీజేపీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



