– ఎన్‌ఎఫ్‌ఐడబ్య్లూ జాతీయ ప్రధాన కార్యదర్శి నిషాసిద్దు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
మహిళల హక్కులను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కాలరాస్తోందని భారత జాతీయ మహిళా సమాఖ్య (ఎన్‌ఎఫ్‌ఐడబ్య్లూ) జాతీయ ప్రధాన కార్యదర్శి నిషాసిద్దు విమర్శించారు. మహిళల నుంచి నాణ్యమైన విద్య, వైద్యాన్ని దూరం చేస్తోందని విమర్శించారు. రానున్న కేంద్ర బడ్జెట్‌లో వైద్యం, విద్యా రంగాలకు కేటాయింపులు పెంచాలని డిమాండ్ చేశారు. ఆదివారం హైదరాబాద్ మఖ్ధూంభవన్‌లో ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.జ్యోతి, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం.సదాలక్ష్మి, ఉపాధ్యక్షులు ఎస్.చాయాదేవి, సహాయ కార్యదర్శి ఎం.డి ఫమీద, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు జి.హైమావతి, మాదవితో కలిసి నిషా సిద్దు విలేకర్లతో మాట్లాడారు. మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించే గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు. నగరాల పేర్లను మార్చినంత మాత్రాన మోడీ విశ్వగురువు కాలేరని హెచ్చరించారు. మహిళలకు ఉపాది అవకాశాలను కల్పించాలని కోరారు. రాజస్థాన్ గత ప్రభుత్వం రూ.25 లక్షల వరకు చికిత్సను అందించే అవకాశాన్ని తగ్గించి, బీజేపీ ప్రభుత్వం ఆయ్మూషాన్ భారత్ పేరుతో కేవలం రూ.5లక్షల వరకే చికిత్సను అందిస్తున్నారని విమర్శించారు. మణిపూర్ మహిళలు, బాలికలపైన దాడులు జరిగినప్పటికీ మోడీ ప్రభుత్వం పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు 2030 నాటికి అమలు చేస్తామనడం విడ్డూరమన్నారు. ‘సర్’ పేరుతో తమకు అనుకూలంగా లేని వారిని ఓటరు జాబితా నుంచి తొలగిస్తున్నారని విమర్శించారు. సమావేశంలో ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ నాయకులు షహీదా, అంజమ్మ, లావణ్య, ప్రమీల, బాలమణి, ఆర్.సునీత, చంద్రమ్మ పాల్గొన్నారు.
మహిళల హక్కులను కాలరాస్తున్న బీజేపీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



