- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో ఆశ్చర్యకర ఘటన జరిగింది. సర్పంచ్ బరిలో నిలిచిన ఓ అభ్యర్థికి ఒక్క ఓటూ రాలేదు. వరంగల్ జిల్లా ఖానాపురం మండలం కీర్యాతండాలో ఈ నెల 17న సర్పంచ్ ఎన్నికల పోలింగ్ జరిగింది. మొత్తం 239 ఓట్లు పోలవగా బీజేపీ బలపరిచిన బోడ గౌతమికి కనీసం ఒక్క ఓటు కూడా పడలేదు. చివరికి నోటాకు ఒక ఓటు పోలైంది. దీంతో ఆమె తనకు తానూ ఓటు వేసుకోలేదా? అని అంతా ఆశ్చర్యపోతున్నారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు.
- Advertisement -



