Thursday, January 1, 2026
E-PAPER
Homeతాజా వార్తలుసమ్మర్‌ స్పెషల్‌గా 'ది బ్లాక్‌ గోల్డ్‌' రిలీజ్‌

సమ్మర్‌ స్పెషల్‌గా ‘ది బ్లాక్‌ గోల్డ్‌’ రిలీజ్‌

- Advertisement -

కథానాయిక సంయుక్త ప్రధాన పాత్రలో నటిస్తున్న పాన్‌-ఇండియన్‌ యాక్షన్‌ డ్రామా ‘ది బ్లాక్‌ గోల్డ్‌’. యోగేష్‌ కెఎంసి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మాగంటి పిక్చర్స్‌ భాగస్వామ్యంతో హాస్య మూవీస్‌ బ్యానర్‌పై రాజేష్‌ దండా నిర్మిస్తున్నారు. పవర్‌ఫుల్‌ కమర్షియల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో సంయుక్త ఇంటెన్స్‌ పోలీస్‌ ఆఫీసర్‌లో పాత్రలో మునుపెన్నడూ చూడని విధంగా కనిపించనున్నారు. చిత్ర బృందం నూతన సంవత్సరం సందర్భంగా ఒక ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్‌ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. వరుస విజయాలు, యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌లను అందించిన నిర్మాత రజేష్‌ దండా ఈ పాన్‌-ఇండియా యాక్షన్‌ విజువల్‌తో ఒక కొత్త జోన్‌లో అడుగుపెడుతున్నారు.

‘కె-రాంప్‌’ విజయం తర్వాత ఆయన నిర్మిస్తున్న భారీ స్థాయి యాక్షన్‌ డ్రామా చిత్రమిది. ఇప్పటికే ట్రేడ్‌ వర్గాలలో, సినీ ప్రేక్షకులలో బలమైన బజ్‌ను సృష్టిస్తోంది. చిత్రీకరణ దాదాపు పూర్తి కావచ్చింది. సుమారు 75% షూటింగ్‌ పూర్తయింది. కేవలం 15 రోజుల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉంది. పోస్ట్‌-ప్రొడక్షన్‌ పనులు కూడా ఏకకాలంలో జరుగుతున్నాయి. ఈ చిత్రంలో సరికొత్త కథన విధానం, అద్భుతమైన యాక్షన్‌ సన్నివేశాలు, ఊహించని మలుపులతో ఉండబోతోంది. ఈ చిత్రాన్ని సమ్మర్‌ స్పెషల్‌గా విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఈచిత్రానికి సహ నిర్మాత: సింధు మాగంటి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -