నవతెలంగాణ-కమ్మర్ పల్లి : మండలంలోని ఉప్లూర్ గ్రామానికి చెందిన జిందం గంగాధర్ ఇంట్లో బ్రహ్మ కమలం పుష్పం వికసించింది. సంవత్సరానికి ఒకసారి మాత్రమే పూసే ఈ బ్రహ్మ కమలం పుష్పం శుక్రవారం రాత్రి వికసించడంతో గంగాధర్ కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. సాధారణంగా అన్ని పుష్పాలు చెట్టు కాండం నుండి పూస్తే, బ్రహ్మ కమలం పుష్పం మాత్రం ఆకుల నుండి ఉద్భవిస్తుంది. రాత్రిపూట మాత్రమే వికసించే ఈ బ్రహ్మ కమలాన్ని చూడడాన్ని ప్రజల అదృష్టంగా భావిస్తారు. రాత్రిపూట వికసించి, ఉదయం పూట బ్రహ్మ కమలం వాడిపోతుంది. సన్ ఫ్లవర్ జాతికి చెందిన మొక్కైనా బ్రహ్మ కమలం, హిమాలయ పర్వతాలు, ఉత్తర బర్మా, నేపాల్, టిబెట్, దక్షిణ చైనా దేశాల్లో కనబడుతుంది. బ్రహ్మ కమలం మన దేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్ర పుష్పం. ఈ మొక్కను కింగ్ ఆఫ్ హిమాలయన్ ఫ్లవర్ అంటారు. ఈ మొక్కపై ఆకులే పువ్వులుగా రూపాంతరం చెందుతాయి. హిందూ పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు బ్రహ్మ కమలంపై కూర్చొని ఉంటాడు.ఆయుర్వేదం ప్రకారం ఈ మొక్కను కాళ్లు, చేతివేళ్ల పక్షవతానికి, మెదడు సంబంధ వ్యాధులకు వాడతారు. ప్రాంతాలను బట్టి బ్రహ్మ కమలం ఆకులు, వేర్లు, విత్తనాలను పలు రకాల సమస్యలకు దివ్య ఔషధంగా ఉపయోగిస్తారు.
వికసించిన బ్రహ్మ కమలం ..
- Advertisement -
- Advertisement -