Tuesday, December 23, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంనాగరికత వికాసంలో పుస్తకం గొప్ప మార్పు ప్రక్రియ

నాగరికత వికాసంలో పుస్తకం గొప్ప మార్పు ప్రక్రియ

- Advertisement -

ప్రొఫెసర్‌ పార్థసారథి

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
మానవ నాగరికత వికాసంలో పుస్తకం ఒక గొప్ప మార్పు ప్రక్రియ అనీ, సామాజిక చైతన్యానికి అది ప్రధాన మెట్టు అని ఉస్మానియా యూనివర్సిటీ రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ పార్థసారథి తెలిపారు. 38వ హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌లో భాగంగా అనిశెట్టి రజిత వేదికపై సోమవారం సాయంత్రం ‘పుస్తకం దారి దీపం’ అనే అంశంపై చర్చా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రొఫెసర్‌ పార్థసారథి సమన్వయకర్తగా వ్యవహరించారు. అరుణోదయ విమల, సాహిత్య అకాడమీ కార్యదర్శి బాలాచారి మాట్లాడారు. ఈ సందర్భంగా పార్థసారథి మాట్లాడుతూ ఒక పుస్తకం మన పాత భావాలను మార్చి కొత్త ఆలోచనలను రేకెత్తించినప్పుడే దానికి సార్థకత చేకూరుతుందని చెప్పారు. 50 ఏండ్ల క్రితం తాను చదివిన రాజారామోహన్‌ రావు కథ నేటికీ తనను వెంటాడుతోందని చెప్పారు. సమాజంలోని అత్యంత క్రూరమైన వాస్తవాల నుంచే గొప్ప కథలు పుడతాయని వివరించారు.

వట్టికోట ఆళ్వారుస్వామి రచించిన ‘ప్రజల మనిషి’, బంకీమ్‌ చంద్ర ఛటర్జీ ‘దుర్గేష్‌ నందిని’ వంటి నవలకు ఉన్న ప్రభావం సామాన్యమైంది కాదని గుర్తుచేశారు. పుస్తకాలు కేవలం అక్షరాల కూర్పు కాదనీ, అవి మన అంతరాల్లోని చీకటిని తొలగించే జ్ఞాన దీపాలని ఆయన కొనియాడారు. అరుణోదయ విమల మాట్లాడుతూ మనిషి జీవితంలో పుస్తకం ఒక గొప్ప మార్పునకు భూమిక పోషిస్తుందని ప్రముఖ ప్రజా గాయని తెలిపారు.తన ఇంటర్మీడియట్‌ రోజుల్లో బహుమతిగా వచ్చిన మాక్సిమ్‌ గోర్కీ ‘అమ్మ’, అలెగ్జాండర్‌ హేలీ ‘ఏడు తరాలు’ నవలలు తన జీవితాన్ని మలుపు తిప్పాయని గుర్తు చేసుకున్నారు. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య 50 ఏండ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకొనీ, ఉద్యమాల్లో ఆ సంస్థ ఎదుర్కొన్న ఒడిదొడుకులు, కళాకారుల అనుభవాలను క్రోఢకీరిస్తూ సుమారు 670 పేజీలతో ప్రత్యేక ‘సావనీర్‌’ను రూపొందిం చినట్టు తెలిపారు. ఈ బుక్‌ ఫెయిర్‌లో అందుబాటు లోకి తెస్తున్నట్టు వెల్లడించారు.

తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి బాలాచారి మాట్లాడుతూ మారుమూల పల్లెలో నిరక్షరాస్య తల్లిదండ్రుల మధ్య పుట్టిన తాను నేడు సాహిత్య అకాడమీ కార్యదర్శి స్థాయికి చేరడానికి పుస్తకాలే దారిదీపాలుగా నిలిచాయని తెలిపారు. తెలుగు మీడియం పాఠశాల నుంచి పీహెచ్‌డీ వరకు తన ప్రయాణం పుస్తకాల వల్లే సాధ్యమైందని చెప్పారు. గాంధీజీ రచించిన ‘సత్యశోధన’ తనలో నిజాయితీని నింపగా, వివేకానందుని సూక్తులు యువతలో ధైర్యాన్ని, ఏదో సాధించాలనే తపనను కలిగిస్తాయని వివరించారు. శ్రీశ్రీ ‘మహా ప్రస్థానం’ వంటి రచనలు మనిషి శక్తిని సన్మార్గంలో నడిపి స్తాయని కొనియాడారు. సాంకేతికత అందుబాటులో ఉన్న నేటి కాలంలోనూ పుస్తకం మనిషిని ప్రభావితం చేస్తూనే ఉంటుందనీ, చిన్నతనంలో చదివే పుస్తకాలే జీవితానికి దిక్సూచు లని ఆయన స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -