అలనాటి మేటినటి, నిర్మాత, కృష్ణ వేణి జీవిత చరిత్రను ‘మీర్జాపురం రాణి-కృష్ణవేణి’ అనే పేరుతో సీనియర్ జర్నలిస్ట్ భగీరథ రాసిన పుస్తకాన్ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు.
ఆ తరం నటీమణి, గాయని స్టూడియో అధినేత కృష్ణవేణి జీవితం ఈ తరం వారికి మార్గదర్శకంగా ఉంటుందని, అందుకే ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడం సంతోషంగా ఉందని సీఎం చంద్రబాబు చెప్పారు. మహానటుడు ఎన్.టి.రామారావుని ‘మనదేశం’ సినిమా ద్వారా తెలుగు సినిమా రంగానికి పరిచయం చేసిన కృష్ణ వేణి అంటే తనకు ఎంతో గౌరవమని ఆయన తెలిపారు.
ఈ పుస్తకావిష్కరణలో కృష్ణవేణి కుమార్తె అనురాధా దేవి, నందమూరి రామకృష్ణ, టీడీపీ సీనియర్ నేత టీడీ జనార్థన్, నిర్మాతలు డీవీకే రాజు, ఉమామహేశ్వరరావు, పర్వతనేని రాంబాబు, కాకాని బ్రహ్మం, క్రొత్తపల్లి శ్రీధర్ ప్రసాద్, ఝాన్సీ రాణి, యువహీరో అభిరామ్, గుమ్మడి గోపాలకృష్ణ పాల్గొన్నారు. తను రాసిన పుస్తకం సీఎం చంద్రబాబు ఆవిష్కరించడం మర్చిపోలేని అనుభవమని రచయిత భగీరథ సంతోషం వ్యక్తం చేశారు.
ఘనంగా ‘మీర్జాపురం రాణి-కృష్ణవేణి’ పుస్తకావిష్కరణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



