Monday, January 12, 2026
E-PAPER
Homeదర్వాజసబ్‌ కాన్సెస్‌ను ప్రభావితం చేసిన పుస్తకం

సబ్‌ కాన్సెస్‌ను ప్రభావితం చేసిన పుస్తకం

- Advertisement -

‘న్యాయం గెలుస్తుంది గెలిచేదంతా న్యాయం కాదు’-శ్రీశ్రీ వాక్యం చాలా మంది రచయితలకి, పుస్తకాలకి కూడా ఒప్పుతుంది. సోకాల్డ్‌ రచయితలు, పుస్తకాల పట్ల నాకు ముందునుంచే ఒకరకమైన విరక్తి. ‘నాది చదువు’ అని ఏ రచయితైనా అడిగాడా అతడి పుస్తకం అసలు చదవను. రాశాక చదవదగిందో, కాదో పాఠకులు నిర్ణయిస్తారు. బలవంతంగా రుద్దడం వల్ల కాదు.
సహజంగా ఈ పుస్తకం చదవాలి అని పెద్ద todo-list పెట్టుకోను (చాలా సార్లు కుదురలేదు కాబట్టి). యాక్సిడెంటల్‌ గా ఎదురైనవి, విన్నవి, రివ్యూ రైటింగ్స్‌ ద్వారా తెలిసివచ్చినవే చదవడానికి ప్రయారిటీ చూపుతా. ముఖ్యంగా గుడ్‌ రీడర్స్‌ తో నేను చదివిన పుస్తకాలు, వాళ్ళు చదివిన పుస్తకాల గురించి పంచుకొంటూ ఉంటాను. ఒకరోజు ఓ సాహితీ పత్రికలో ‘తావొ తె చింగ్ణ-లావోత్సు (అనువాదం:దివి సుబ్బారావు) గురించి ఒక రివ్యూ చూశాను. అందులో విమర్శకుడు (పేరు గుర్తులేదు) కోట్‌ చేసిన వాక్యాలు నన్ను పుస్తకం కొనేలా చేశాయి. వెంటనే పుస్తకం తెప్పించి చదివాను. ఒక్కో వాక్యం నన్ను వివిధ కోణాల్లో ఆలోచనకు, అనుభూతికి, పదసంపదకు గురిచేశాయి. ఆ పుస్తకం గురించి నా మిత్రులైన నేను భోగిని మహేష్‌, నాగరాజు సారిపల్లి (టీచర్‌-పార్వతీపురం), అలిసెట్టి మధు (టీచర్‌-రాయచోటి), డా. బట్టు విజరులకు ఆ పుస్తక ప్రచారకర్తలా చెప్పడం. వాళ్ళతో చదివిచడం కూడా జరిగింది. మహేష్‌ నేను అయితే ఏకంగా అనువాదకుడైన దివి సుబ్బారావు గారి ఇంటికి(చైతన్యపురి) వెళ్లి మరి మా పాఠక ఆనందాన్ని తెలిపాం. అయన కూడా పరవశించి అయన రచనలన్నీ ఒకసేట్‌ కాపీ మా ఇద్దరికి ఇచ్చాడు.
‘తావొ తె చింగ్ణ-లావోత్సు (అనువాదం:దివి సుబ్బారావు). ఇది చైనీయుల ఆలోచనలన్నీ, జీవితాల్ని మార్చి వేసిన పుస్తకం. క్రీ.పూ. 5 వ శతాబ్దంలో రాయబడినది. దీని ‘లావొత్సు’ అనే తాత్వికుడు రాశాడు. ఇది రాసింది ఒక్కరు కాదు, లావొ త్సు కాదు అనే వాదనలు కూడా వున్నాయి. కానీ ఎక్కువ మందికి తనే రాశాడన్న విశ్వాసం ఉంది. ఆ కాలంలో విలువలు తగ్గిపోవడాన్ని గమనించి, జీర్ణించుకోలేక సమాజం నుంచి అజ్ఞాతంలోకి వెళ్తున్న తరుణంలో మార్గ మధ్యన ఒక కాపరి ఎదురై ‘ఎలాగో వెళ్తున్నారు. మీకున్న జ్ఞానాన్ని ఒక పుస్తకంగా రాయకూడదు’ అన్న అభ్యర్ధన మేరకు రాసిందే ఈ ‘తావొ తె చింగ్ణ. దీనిలో తత్వం నుంచి కామం వరకు, రాజ్యం నుంచి వ్యక్తిగతం వరకు అన్నీ విషయాలపైన తనదైన శ్రేయస్కరమైన భావాలను పంచుకొన్నాడు. అప్పటి కాల పరిస్థితులతో పోల్చిచూసినప్పుడు చూస్తే ‘లావో త్సు’ ముందుచూపు, చైనా గొప్ప ఫిలాసఫర్‌ ఐనా కన్‌ ఫ్యూషియస్‌ వంటి వాడే ‘అయనను నా గురువుగా భావిస్తాను’ అని అనడంలో అతడి స్థాయి ఏంటో మనకు అర్థమవుతుంది.
మొత్తంగా ఈ పుస్తకంలో రెండు భాగాలుగా విభజిస్తూ 81 పథల రూపంలో ‘లావోత్సు’ నీతి వాక్యాలు ఉన్నాయి. దీనిని దివి సుబ్బారావు గారు ఆంగ్లం నుంచి అనువాదం చెయ్యడం జరిగింది.

– జ్ఞానులు వెనక నిలబడుతారు కాబట్టే అందరికంటే ముందుంటారు (పథం:7)
– మితిమీరిన ధన గౌరవాలు ఉపద్రువానికి దారి తీస్తవి. నీ కర్తవ్యం నీవు నిర్వహించాక దూరంగా తొలగి ఉండు అలావుంటే స్వర్గం నీ చేతికి అందివచ్చినట్లు అవుతుంది.(9)
– మట్టిని పాత్రగా తీర్చిదిద్దినా పాత్ర ప్రయోజనందాని ఖాళీ ప్రదేశంలోనే వుంది. అందువలన ఉన్నదానిలో లాభం ఏ విధంగా పొందుతామో లేనిదాని ఉపయోగం ఆ విధంగానే గుర్తించాలి (11)
– ప్రశంస, అవమానం రెండింటికీ సమానంగానే భయపడి దూరంగా వుండాలి. (13)
– ఒకప్పుడు పాలకులున్న సంగతే ప్రజలకు తెలియదు. తరువాత తెలుసుకొని ప్రశంసించారు. తరువాత భయపడ్డారు. తరువాత అసహ్యించుకొన్నారు.
– జ్ఞాని నోటి నుండి ఏ విధంగాను ఒక్కమాట రాబట్టలేం. తన కర్తవ్య నిర్వహణ పూర్తయాక దేశంలో ప్రతి ఒక్కరు అంటారు ‘ఆపని దాని అంతట అదే జరిగింది’ అని (17)
– తెలుపు తెలిసీ నలుపును వీడని వాడు ప్రపంచానికి ఉదాహరణ పూర్వకంగా ఉంటాడు (28)
– యుద్దంలో విజయం సంతోషదాయకం కాదు. అలా ఐతే హత్యాకాండలో నీవు ఆనందానుభూతి చెందుతున్నావన్నమాట (31)
– ఇతరుల్ని తెలుసుకొనటం తెలివి. తనను తను తెలుసుకోవడం జ్ఞానం. ఇతరుల్ని ఓడించేందుకు దేహబలం చాలు. తనను తాను జయించుకోనేందుకు ఆత్మశక్తి అవసరం. మత్యువు తరువాత కూడా ఎవడు నశించడో వాడు దీర్ఘాయుష్మంతుడు. (33)
– సంకోచించడానికి ముందు వ్యాకోచించాలి. తీసికోదలిస్తే ముందు ఇచ్చి ఉండాలి ఇది తెలియటాన్నే జ్ఞానం అంటారు. (36)
– ఎంత ఎక్కువగా విషయలంపటైతే, అంత ఎక్కువగా బాధ అనుభవిస్తారు. ఎంత ఎక్కువగా కూడా బెడితే అంత ఎక్కువగా నష్టపోతారు (44)
– నూరు నదులకు సముద్రం రాజు ఎలా కాగలిగింది? అది వాటికంటే దిగువన వుంది కాబట్టి జ్ఞాని ప్రజలకంటే పైన వుండదలిస్తే మాటల్లో దిగువన వుండాలి. వారిని నడిపిస్తూ ముందు వుండదలిస్తే అందరికి వెనుక నిలబడాలి (66)
– ప్రజలు ఆకలితో ఎందుకు అలమటిస్తారు? పాలకులు వారి అధిక పన్నుల వల్ల. ప్రజలేందుకు తిరుగుబాటు చేస్తారు? పాలకులు ప్రజల దైనందిన జీవితాల్లో జోక్యం చేసుకోవడంవల్ల (75 )
– బి. మదన్‌ మోహన్‌ రెడ్డి, 9989894308

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -