Monday, March 9, 2026
E-PAPER
Homeక్రైమ్ఈతకు వెళ్లి బాలుడు గల్లంతు

ఈతకు వెళ్లి బాలుడు గల్లంతు

- Advertisement -

నవతెలంగాణ – మల్దకల్
మండలంలోని అమరవాయి గ్రామంలో జయరాజు (13) స్నేహితులతో కలసి ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు బావిలో మునిగి గల్లంతైయ్యాడు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు తండోపతండాలుగా బావి దగ్గరకు చేరుకున్నారు. కాగా.. సమాచారం అందుకున్న ఎస్సై శ్రీహరి తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని, స్థానికులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం బాలుడి ఆచూకీ కోసం ఫైర్ ఫైర్ సిబ్బంది సహయంతో బావిలోని నీటిని బయటకు తీస్తున్నారు. ఘటనా స్థలిలో కుటుంబ సభ్యుల రోదనాలు మిన్నంటాయి. అయితే బాలుడు బావిలో గల్లంతై చాలా సమయమైందని, తను ప్రాణాలతో ఉండకపోవచ్చని స్థానికులు చెబుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -