‘అర్ధనారి’, ‘తెప్ప సముద్రం’, ‘వెడ్డింగ్ డైరీస్’ వంటి వైవిధ్యమైన సినిమాలతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న అర్జున్ అంబటి ఆ తర్వాత బుల్లితెరపై ‘బిగ్ బాస్’ రియాలిటీ షోతో ఫ్యామిలీ ఆడియన్స్‌కి మరింత దగ్గరయ్యారు. ప్రస్తుతం రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా ‘పెద్ది’లో కూడా అత్యంత కీలక పాత్ర పోషిస్తున్న ఆయన హీరోగా రూపొందిన లేటెస్ట్ మూవీ ‘పరమపద సోపానం’.
జెన్నిఫర్ ఇమ్మాన్యుయేల్ కథానాయికగా నటించిన ఈ సినిమాని గణపర్తి శ్వేత సమర్పణలో స్వయంభూ క్రియేషన్స్ సంస్థ పై గణపర్తి నారాయణరావు తేలప్రోలు ప్రసన్న ఆంజనేయులు సంయుక్తంగా నిర్మించారు. పులగం సుప్రియ సహ నిర్మాత. డైరెక్టర్ పూరి జగన్నాథ్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసిన నాగశివ ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తించారు.
అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా తెరకెక్కించిన ఈ చిత్రానికి రవితేజ ‘ఈగల్’ వంటి భారీ బడ్జెట్ సినిమాతో సంగీత దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న డేవ్ జాండ్ సంగీతం అందించారు. ప్రమోషన్లో భాగంగా విడుదల చేసిన ‘చిన్ని చిన్ని తప్పులేవో’, ‘భూమ్ భూమ్’ వంటి లిరికల్ సాంగ్స్‌కి అలాగే టీజర్‌కి విశేషాదరణ లభించింది. పోస్ట్ ప్రొడక్షన్స్ పనులన్నీ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈనెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేదీని ప్రకటిస్తూ తాజాగా చిత్ర బృందం ఒక పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో హీరో అర్జున్ అంబటి లుక్ ఇంటెన్స్ ఫీల్ కలిగిస్తుంది. అలాగే కథ, కథనాల పై కూడా మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది అని చిత్ర యూనిట్ తెలిపింది. అర్జున్ అంబటి, జెన్నిఫర్ ఇమ్మాన్యుయేల్ జంటగా నటించిన ఈ చిత్రానికి దర్శకత్వం : నాగ శివ, నిర్మాతలు: గణపర్తి నారాయణరావు, తేలప్రోలు ప్రసన్న ఆంజనేయులు, లైన్ ప్రొడ్యూసర్ : పసుపులేటి సౌమ్య, సంగీతం : డేవ్ జాండ్, సినిమాటోగ్రఫీ : ఈశ్వర్.
సరికొత్త ‘పరమపద సోపానం’
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



