నవతెలంగాణ – మల్హర్ రావు
భూమి కోసం, భూక్తి కోసం, వేట్టిచాకిరి విముక్తి కోసం పోరాడిన తెలంగాణ సాయుధ పోరాట వీరనారి ఐలమ్మని పలువురు కొనియాడారు. బుధవారం మండల కేంద్రంలో ఐలమ్మ 40వ వర్థంతి వేడుకలు రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం ఐలమ్మ విగ్రహనికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సుంకరి సత్యనారాయణ, మాజీ ఉప సర్పంచ్ ఇందారపు చెంద్రయ్య, మాజీ ఎంపిటిసి తిర్రి సమ్మయ్య, మాజీ వార్డు సభ్యుడు కుంట సదానందం, రజక సంఘం మండల అధ్యక్షుడు పావురాల ఓదెలు, ఉపాధ్యక్షుడు కనుకూల రాకేష్, ప్రధాన కార్యదర్శి పైడాకుల సమ్మయ్య ,గ్రామ శాఖ అధ్యక్షులు పైడాకుల లక్ష్మయ్య, ఉపాధ్యక్షులు పైడాకుల రాజసమ్మయ్య, గౌరవ అధ్యక్షులు పైడాకుల పోచ మల్లయ్య పాల్గొన్నారు.
జమిందార్లను ధైర్యంగా ఎదుర్కొన్న వీరనారి ఐలమ్మ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES