Friday, June 13, 2025
E-PAPER
Homeసినిమాఅందర్నీ మెప్పించే 'తమ్ముడు'

అందర్నీ మెప్పించే ‘తమ్ముడు’

- Advertisement -

నితిన్‌ హీరోగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ నిర్మాణంలో శ్రీరామ్‌ వేణు దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘తమ్ముడు’. దిల్‌ రాజు, శిరీష్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జూలై 4న ఈ సినిమా వరల్డ్‌ వైడ్‌గా గ్రాండ్‌ థియేట్రికల్‌ రిలీజ్‌కు రెడీ అవుతోంది. బుధవారం ఈ చిత్ర ట్రైలర్‌ను ఘనంగా రిలీజ్‌ చేశారు.
హీరో నితిన్‌ మాట్లాడుతూ, ‘ట్రైలర్‌ మీ అందరికీ నచ్చిందని నమ్ముతున్నాం. ఈ సినిమాకు లయ చాలా ఇంపార్టెంట్‌. ఆమె చాలా బాగా పర్‌ఫార్మ్‌ చేశారు. ఎడిటర్‌ ప్రవీణ్‌ పూడి, డీవోపీ గుహన్‌, అజనీష్‌ అద్భుతమైన అవుట్‌ఫుట్‌ ఇచ్చారు. సప్తమిగౌడ క్యారెక్టర్‌ మిమ్మల్ని సర్‌ప్రైజ్‌ చేస్తుంది. మా డైరెక్టర్‌ వేణు నాలుగేళ్లు ఈ చిత్రం కోసం కష్టపడ్డారు. ఎక్కువగా ఫారెస్ట్‌లో షూట్‌ చేశాం. ‘దిల్‌’ తరువాత నా కెరీర్‌లోనే హయ్యెస్ట్‌ బడ్జెట్‌ చిత్రాన్ని దిల్‌రాజు నిర్మించడం చాలా ఆనందంగా ఉంది’ అని అన్నారు.
‘ఈ మూవీతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను. ఇందులో రత్న అనే క్యారెక్టర్‌ చేశాను. డానీ ఒక క్యారెక్టర్‌ నాతో పాటు ఉంటుంది’ అని హీరోయిన్‌ సప్తమి గౌడ చెప్పారు. లయ మాట్లాడుతూ, ‘నేను సినిమా ఇండిస్టీ నుంచి విరామం తీసుకుని 20 ఏళ్లవుతోంది. ఈ మూవీతో తిరిగి నా నట ప్రయాణం మొదలుపెట్టాను. ఈ సినిమా తప్పకుండా విజయాన్ని సాధిస్తుందనే నమ్మకం మా అందరిలో ఉంది’ అని తెలిపారు.
దర్శకుడు శ్రీరామ్‌ వేణు మాట్లాడుతూ, ‘ఈ కథను కొందరు హీరోలకు చెబితే రిజెక్ట్‌ చేశారు. కానీ నితిన్‌ ఈ కథలోని ఎమోషన్‌ అర్థం చేసుకుని నాకు ఫుల్‌ ఫ్రీడమ్‌ ఇచ్చారు. ఈ సినిమా సాధించబోయే సక్సెస్‌ క్రెడిట్‌ను దిల్‌ రాజు, నితిన్‌, లయ, నా ఇతర టీమ్‌ అందరికీ ఇస్తాను. ఇది పక్కా అవుట్‌ అండ్‌ అవుట్‌ కమర్షియల్‌ మూవీ. అయితే ఇందులో కొత్త స్క్రీన్‌ ప్లే చూస్తారు’ అని చెప్పారు.
ఈ సినిమా కోసం డైరెక్టర్‌ శ్రీరామ్‌ వేణు నాలుగేళ్లు కష్టపడ్డాడు. ఈ కథ అనుకున్నప్పుడే విజువల్‌, సౌండింగ్‌ కొత్తగా ఉండేలా డిజైన్‌ చేస్తానని శ్రీరామ్‌ చెప్పాడు. అన్నట్లుగానే అద్భుతంగా చేశాడు. ‘ముద్దుల మావయ్య’ సినిమాకి దీనికి సంబంధం ఉండదు. ఇది అక్కా, తమ్ముడి మధ్య జరిగే కథ. అయితే కొత్త కాన్సెప్ట్‌ మూవీ. దీనికి రిఫరెన్స్‌ లేదు. ట్రైలర్‌కి మీ అందరి నుంచి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. రేపు థియేటర్‌లోనూ ఇదే రెస్పాన్స్‌ వస్తుం దని, అక్కా తమ్ముడి కథలకు ఈ మూవీనే ఒక రిఫరెన్స్‌గా ఉంటుందని నమ్ముతున్నాం.
– నిర్మాత దిల్‌ రాజు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -