Thursday, February 5, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమళ్లీ వచ్చేది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే

మళ్లీ వచ్చేది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే

- Advertisement -

నర్సాపూర్‌ అభివృద్ధికి పార్టీ అభ్యర్థులను గెలిపించాలి : మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు

నవతెలంగాణ-నర్సాపూర్‌
మళ్లీ వచ్చేది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. బుధవారం మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ పట్టణంలోని సాయి కృష్ణ కళ్యాణమండపంలో స్థానిక ఎమ్మెల్యే సునీత రెడ్డి అధ్యక్షతన మున్సిపల్‌ ఎన్నికలపై నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. నర్సాపూర్‌ మున్సిపాలిటీ అభివృద్ధి చెందిందంటే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలోనేనని అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చి 700 రోజులు గడుస్తున్నా ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. నర్సాపూర్‌ మున్సిపాలిటీకి ఒక్క పైసా కూడా ఇవ్వలేదని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా డబ్బులు పెట్టి గెలవాలని కాంగ్రెస్‌ ప్రయత్నిస్తున్నదని తెలిపారు.

కాంగ్రెస్‌, బీజేపీ నాయకుల మాటలు నమ్మి మోసపోవద్దని అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ బడ్జెట్‌లో ఆంధ్రాకు మూటలు ఇచ్చి తెలంగాణకు మొండి చేయి ఇచ్చిందని విమర్శించారు. ఏమీ చేయని బీజేపీ నాయకులకు ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు. నర్సాపూర్‌ మరింత అభివృద్ధి చెందాలంటే బీఆర్‌ఎస్‌ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ లేబర్‌ వెల్ఫేర్‌ బోర్డు చైర్మెన్‌ దేవేందర్‌ రెడ్డి, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మెన్‌ చంద్ర గౌడ్‌, మాజీ జెడ్పీ కోఆప్షన్‌ మెంబర్‌ మన్సూర్‌, మాజీ మున్సిపల్‌ చైర్మెన్‌ అశోక్‌ గౌడ్‌, నాయకులు సింగయ్యపల్లి గోపి, శివకుమార్‌, శేఖర్‌, వార్డు అభ్యర్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -