అ పార్టీ వల్లే కృష్ణాలో నీటి హక్కులు కోల్పోయాం
ఉమ్మడి నల్లగొండ, మహబూబ్‌నగర్‌లకు అన్యాయం చేశారు : నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
క్రృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యూనల్-2 (కేడబ్ల్యూడీటీ) తుది తీర్పు వచ్చే వరకు 299 టీఎంసీలకు కట్టుబడి ఉంటామని అఫెక్స్ కౌన్సిల్‌లో బీఆర్‌ఎస్ ఒప్పుకుందని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి అన్నారు. సోమవారం అసెంబ్లీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. అపెక్స్ కౌన్సిల్, కేఆర్‌ఎంబీ బోర్డు మీటింగుల్లో చేసిన సంతకాల మినిట్స్‌ను సభకు సమర్పిస్తామని ఉత్తమ్ తెలిపారు. బీఆర్‌ఎస్ చేసిన తప్పిదాలకు తెలంగాణ నీటి హక్కులను కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. చేసిందంతా చేసి…ఉమ్మడి పాలమూరు, నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు కాంగ్రెస్ అన్యాయం చేసిందంటూ గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ”పాలమూరు-రంగారెడ్డిలో 90 టీఎంసీ లకు బీఆర్‌ఎస్ ప్రతిపాదించింది. దాన్ని మేము ముందుకు తీసుకువెళ్తున్నాం. 45 టీఎంసీలు మైనర్ ఇరిగేషన్‌కు, 45 టీఎంసీలు గోదావరి డైవర్షన్ వారిచ్చిన జీవోలో వాడారు. దాన్ని ప్రస్తావిస్తూ మేం లేఖ రాశాం. మొదటగా 45 టీఎంసీలను మైనర్ ఇరిగేషన్‌కు క్లియర్ చేయమని అడిగాం. పేజ్-1లో ఇనిషియల్‌గా చేయమని అడిగాం. ఇందులో తెలంగాణ ప్రయోజనాలను ఎక్కడా విస్మరించలేదు.
వాస్తవం ఇలా ఉంటే బీఆర్‌ఎస్ దాన్ని తప్పుగా ప్రచారం చేస్తున్నది” అని మంత్రి విమర్శించారు. పదేండ్లలో నీటి పారుదల శాఖకు రూ.1.83 లక్షల కోట్లు ఖర్చు చేశారని అన్నారు. కేవలం కాళేశ్వరం కోసమే పాలమూరు-రంగారెడ్డి, కోయిల సాగర్, నెట్టెంపాడు, భీమా డిండీ, ఎస్‌ఎల్‌బీసీ మొదలగు ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లా ప్రాజెక్ట్‌లను నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. హరీశ్‌రావు చెబుతున్నట్టు పాలమూరు-రంగారెడ్డికి సంబంధించి 90 శాతం పనులు కాలేదనీ, రూ. 27 వేల కోట్లు ఖర్చు పెట్టి, 36 శాతం పనులు మాత్రమే చేశారని గుర్తు చేశారు. తాము అధికారం చేపట్టిన రెండేండ్లలో దాదాపు రూ.7వేల కోట్లు చేశామని చెప్పారు. రూ.35 వేల కోట్ల అంచనాతో చేపట్టిన ప్రాజెక్ట్ సీడబ్ల్యూసీకి డీపీఆర్ పంపే సమయానికి రూ.65 వేల కోట్లకు చేరుకుందని ఆరోపించారు. ఆయకట్టు కాల్వల భూసేకరణతో కలిసి ప్రస్తుత అంచనాల ప్రకారం పూర్తి చేయాలంటే రూ.70 వేల కోట్లు అవుతుందని చెప్పారు. పాలమూరు-రంగారెడ్డి, కోయిల సాగర్, నెట్టెంపాడు, భీమా, డిండీ, ఎస్‌ఎల్‌బీసీ మొదలగు ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లా ప్రాజెక్ట్‌లను రాబోయే మూడేండ్లలో పూర్తి చేస్తామని ఉత్తమ్ స్పష్టం చేశారు.
299 టీఎంసీలకు బీఆర్‌ఎస్సే ఒప్పుకుంది
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


