సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి రమేష్ బాబు
నవతెలంగాణ – కంఠేశ్వర్
రాష్ట్ర అసెంబ్లీలో మరియు శాసనమండలిలో ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ప్రజలు ఎంతో ఆశతో ఎదురు చూశారని రాష్ట్ర ప్రభుత్వం గత ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై నిధులు కేటాయింపు జరుగుతుందని ఆశపడ్డారని, కానీ ప్రజల ఆశలు అడియాశలు అయ్యాయని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు అన్నారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రధానంగా నిజాంబాద్ జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీ నిజాం షుగర్ ఫ్యాక్టరీ ,నిజామాబాద్ కో ఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ ని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని నడుపుతుందని స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి మాట గత మూడు బడ్జెట్లలో కూడా నిధులు కేటాయించకుండా ఇప్పుడు కూడా నిరాశపరిచారని ఆయన అన్నారు.
పసుపు, ఎర్ర జొన్నలు, మక్కల కొనుగోలుకు బోనస్ ప్రకటిస్తారని, కౌలు రైతుల కు ఇచ్చిన హామీ 12 వేల రూపాయలు ఇస్తారని ఆశపడిన రైతాంగానికి నిరాశ ఎదురైందని అన్నారు. అదేవిధంగా ముద్దులు ,వితంతువులు, బీడీ కార్మికులకు పెన్షన్ పెంపుదలను చేయడానికి తగిన నిధులను కేటాయించలేదని, వికలాంగులకు పెంచుతామన్న పెన్షన్కు నిధులు కేటాయించలేదని, అదేవిధంగా నిరుద్యోగ భృతి ఉద్యోగులకు పిఆర్సి, అంగన్వాడి, ఆశా, మధ్యాహ్న భోజనం తదితర కార్మికులకు కనీస వేతనాలు అమలు కొరకు రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల కొరకు నిధుల కేటాయింపు జరగకపోవడంతో ఆయా వర్గాల ప్రజలు నిరాశ చెందారని ఆయన అన్నారు.
ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆయా వర్గాలకు ఇచ్చిన హామీల అమలు కొరకు నిధుల కేటాయింపు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో. సీపీఐ(ఎం) నగర నాయకులు నాయకులు అప్సే ఉద్దవ్, శేఖర్ గౌడ్, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.



