డీటీఎఫ్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రానున్న బడ్జెట్‌లో విద్యా రంగానికి అధిక నిధులు కేటాయించాలని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (డీటీఎఫ్) రాష్ట్ర అధ్యక్షులు ఎం.సోమయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.లింగారెడ్డిలు డిమాండ్ చేశారు. డీటీఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం రాష్ట్ర అధ్యక్షులు ఎం.సోమయ్య అధ్యక్షతన శనివారం హైదరా బాదులోని డిక్కీ హౌస్ లో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. లింగారెడ్డి ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలు, సంస్థ కార్యకలాపాల నివేదికను ప్రవేశపెట్టారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలపై చర్చించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తన ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన విధంగా విద్యారంగానికి కనీసం 15 శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. 2024 ఏప్రిల్ నుంచి ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు పెన్షనరీ బెనిఫిట్స్ అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల రూ.700 కోట్లు కేటాయి స్తున్నా….అవి ఏ మూలకు సరిపోవడం లేదని తెలిపారు. నెలకు కనీసం రూ.2,000 కోట్లు కేటాయించాలని కోరారు. అదే విధంగా పీఆర్సీ అమలు గడువు ముగిసి దాదాపు రెండు సంవత్స రాలు అయినప్పటికీ కూడా పీఆర్సీని రాష్ట్ర ప్రభు త్వం అమలు చేయకుండా తాత్సారం చేస్తున్నదని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న డీఏలను విడుదల చేయాలని కోరారు. జిల్లా విద్యాధికారి పోస్టుల్లో ఐఏఎస్ అధికారులను నియమించడం సరికాదని తప్పుపట్టారు. సర్వీస్ రూల్స్ సమస్యను పరిష్క రించి జిల్లా ఉప విద్యాధికారి పోస్టులు, మండల విద్యాధికారి పోస్టులు, డైట్ లెక్చరర్ పోస్టు లను వెంటనే భర్తీ చేయాలని వారు డిమాండ్ చేశారు. కేజీబీవి, మోడల్ స్కూల్, ఐటీడీఏ, గురు కుల ఉపాధ్యాయుల సమస్యలు కూడా పరిష్కరిం చాలని కార్యవర్గం కోరింది. ఈ సమా వేశంలో అధ్యాపక జ్వాల ప్రధాన సంపాదకులు డాక్టర్ ఎం.గంగాధర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు పి. శంతన్, టి.శ్రీశైలం, బి.రేణుక, చాప బాబుదొర , రాష్ట్ర కార్యదర్శులు ఎం.సామ్యూల్, జె. రామస్వామి, ఎ. శ్రీనివాస రెడ్డి,ఆర్. లింగయ్య తదితరులు పాల్గొన్నారు.
బడ్జెట్‌లో విద్యారంగానికి అధిక నిధులు కేటాయించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



