రాజకీయ నాయకుడు, వ్యాపారవేత్త గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి ‘జూనియర్’ సినిమాతో హీరోగా పరిశ్రమకు పరిచయం అవుతున్నారు.
రాధా కష్ణ దర్శకత్వంలో వారాహి చలన చిత్రం బ్యానర్‌పై రజని కొర్రపాటి నిర్మించిన ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ఈనెల 18న విడుదల కానుంది. ఒక పాట బిగ్ హిట్ అయి సోషల్ మీడియాలో సంచలనం సష్టించినప్పుడు, అది వైరల్ పాట అనే లేబుల్‌ను సంపాదిస్తుంది. కానీ ‘జూనియర్’ విషయంలో మాత్రం… ఇక్కడ వైరల్ అవుతోందది పాట మాత్రమే కాదు హీరోయిన్ శ్రీలీల కూడా. సెకండ్ సాంగ్ ‘వైరల్ వయ్యారి..’కి శ్రీలీల కొత్త ఇమేజ్ తీసుకొచ్చింది. ఈ పాటకు దేవి శ్రీ ప్రసాద్ మాస్ ఎనర్జీతో నిండిన కంపోజిషన్ ఇచ్చారు. యూత్‌తో కనెక్ట్ అయ్యేలా సోషల్ మీడియా లాంగ్వేజ్, ట్రెండీ ఫ్రేసెస్‌తో పాట హైలైట్ అయింది అని మేకర్స్ అన్నారు.
‘వైరల్ వయ్యారి..’ సందడి షురూ
- Advertisement -
- Advertisement -