Sunday, January 11, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంబ్యాండ్‌ వాయిద్య కళాకారుల క్యాలెండర్‌ ఆవిష్కరణ

బ్యాండ్‌ వాయిద్య కళాకారుల క్యాలెండర్‌ ఆవిష్కరణ

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తెలంగాణ బ్యాండ్‌ వాయిద్య కళాకారుల సంఘం ఆధ్వర్యంలో ముద్రించిన 2026 క్యాలెండర్‌ను చేతి వత్తిదారుల సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్‌ ఎంవీ రమణ, కో కన్వీనర్‌ పైళ్ల ఆశయ్య శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్యాండ్‌ కళాకారులకు ప్రభుత్వం ఐడెంటి కార్డులు, పింఛన్లు, అందించాలని డిమాండ్‌ చేశారు. 50 ఏండ్లకే ఫించన్‌ మంజూరు చేయడంతో పాటు రోడ్డు ప్రమాదంలో గాయపడిన, మరణించిన కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని కోరారు. బడ్జెట్‌లో ప్రత్యేక నిధులు కేటాయించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

గ్రామీణ ప్రాంతాల్లో వద్ధ కళాకారులకు ఎకరం నుంచి మూడు ఎకరాల వరకు భూ పంపిణీ చేయాలని కోరారు. బ్యాండ్‌ కళాకారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి గుమ్మడి రాజు నాగరాజు మాట్లాడుతూ అన్ని జిల్లాల్లో విస్తరణ, మండల, జిల్లా కమిటీలు వేయడం ద్వారా సంఘం బలోపేతానికి కృషి చేయాలని కోరారు. రాష్ట్ర కమిటీ ఏ పిలుపిచ్చినా జయప్రదం చేయాలని సభ్యులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బ్యాండ్‌ వాయిద్య కళాకారుల సంఘం ఉపాధ్యక్షులు గరుడ శ్రీనివాస్‌, రాష్ట్ర కమిటీ సభ్యులు మడిపెద్ది వెంకన్న, ఏమురుల శంకర్‌, వరంగల్‌ రూరల్‌ కార్యదర్శి పోడేటి రాజు, ముషీరాబాద్‌ జోన్‌ నాయకులు మురళి, అంబర్పేట నాయకులు సాయి హుస్సేన్‌, శంకర్‌ వెండి బాబు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -