Wednesday, February 4, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుప్రచారం షురూ

ప్రచారం షురూ

- Advertisement -

6,701 నామినేషన్ల ఉపసంహరణ
బరిలో 12,907 మంది అభ్యర్థులు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌

పురపోరు కొలిక్కి వచ్చింది. నామినేష న్ల ఉపసంహరణ ముగిసి, బరిలో ఉన్న అభ్యర్థుల సంఖ్య ఖరారైంది. 7 మున్సిపల్‌ కార్పొరేషన్లు, 116 మున్సిపాల్టీల్లోని 2,996 వార్డుల్లో మంగళవారం రాత్రి 10 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం పోటీలో మొత్తం 12,907 మంది అభ్యరు ్థలు నిలిచారు. తొలుత 29,694 మంది నామినేషన్లు దాఖలు చేయగా, వాటిలో 10,086 నామినేషన్లు పరిశీలన సమయం లో ఎన్నికల అధికారులు తిరస్కరించారు. మంగళ వారం మరో 6,701 నామినేషన్లను ఉపసంహరించు కున్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రధాన ఘట్టం ముగి యడంతో రాజకీయపార్టీలు ఇక ప్రచారంపై దృష్టి పెట్టాయి. అధికార, ప్రతిపక్షపార్టీల ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో రాజకీయ సమీకరణాలను అంచనా వేయడంలో బిజీగా ఉన్నారు. ఎవరికివారు తమపార్టీ ని గెలిపించుకొ నేందుకు సర్వశక్తులు ఒడ్డేందుకు సిద్ధపడుతున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం రాత్రి పొద్దుపోయే వరకు పార్లమెంటు స్థానాల ఇన్‌చార్జి మంత్రులతో సుదీర్ఘ మంతనాలు జరిపారు. ఎన్నికల వ్యూహాన్ని ఖరారు చేసుకున్నారు. దానిలో భాగంగా బుధవారం నుంచి సీఎం మిర్యాలగూడ నుంచి ఎన్నికల ప్రచార శంఖం పూరిస్తున్నారు. అక్క డి నుంచి గ్రేటర్‌ హైదరాబాద్‌ మినహా అన్ని మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల పరిధిలో సుడిగాలి పర్య టన చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. మంత్రులకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. స్థానిక ఎమ్మెల్యేలకు స్థానిక నాయకత్వ సమన్వయ బాధ్యత లు అప్పగించారు. నామినేషన్ల ఉపసంహరణ పూర్తి కావడంతో బీఆర్‌ఎస్‌ కూడా బుధవారం నుంచి ఎన్ని కల ప్రచారం ప్రారంభిస్తున్నది. ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కే తారక రామారావు కూడా అన్ని మున్సి పాల్టీల్లో ప్రచార పర్యటనలు పెట్టుకున్నారు. మాజీ మున్సిపల్‌ చైర్మెన్లు, జిల్లా అధ్యక్షులకు ప్రత్యేక బాధ్య తలు అప్పగించారు. మెజారిటీ స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా పనిచేసేలా, కేడర్‌ను ఉత్సా హపరుస్తున్నారు. బీజేపీ ఇప్పటికే ప్రచారాన్ని ప్రారం భించినా, ప్రజల నుంచి పెద్దగా ఆశించిన స్థాయిలో వారికి మద్దతు లభించట్లేదు. అనేకచోట్ల అధికార కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోరు జరిగితే, తాము సాధారణ ఓట్లను సాధించినా విజయం సాధించ వచ్చనే రాజకీయ ఎత్తుగడల్లో ఆ పార్టీ నాయకత్వం ఉంది. ఇక్కడినుంచి వారం రోజుల పాటు పట్టణాల్లో మైకుల మోత మోగనుంది. ఈనెల 11న పోలింగ్‌, 13న ఫలితాలు, 16న మున్సిపల్‌ చైర్మెన్లు, వైస్‌ చైర్మెన్ల ప్రమాణస్వీకారాలు జరుగుతాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -