– మాజీ ఎంపీ వి. హనుమంతరావు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కాంగ్రెస్ కార్యకర్తలపై నాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం నమోదు చేసిన కేసులను వెంటనే ఎత్తివేయాలని మాజీ ఎంపీ వి.హనుమంతరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. గురువారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు కార్య కర్తలు కీలకపాత్ర పోషించారని గుర్తుచేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు, గ్రేటర్, జూబ్లీహిల్స్ ఉపఎన్నికలు ఉన్నాయని చెప్పారు. పంచాయతీ ఎన్నికల్లో యువకులదే కీలకపాత్ర అన్నారు. అలాంటి వారిపై ట్రాఫిక్ పోలీసులు విపరీతమైన చలాన్లు వేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని సంబంధిత అధికారులకు సూచనలు చేయాలని విజ్ఞప్తి చేశారు.
బీఆర్‌ఎస్ సర్కారు నమోదు చేసిన కేసులను ఎత్తేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES