Friday, November 21, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సీసీఐ క్వింటాళ్ల నిబంధన వెంటనే ఎత్తివేయాలి..

సీసీఐ క్వింటాళ్ల నిబంధన వెంటనే ఎత్తివేయాలి..

- Advertisement -

– సొసైటీ చైర్మన్ కన్నయ్య గారి హరికృష్ణ రెడ్డి..
నవతెలంగాణ – తొగుట 

రైతులకు ఇబ్బందులు కలిగించే ఏడు క్వింటాళ్ల నిబంధన వెంటనే ఎత్తివేయాలని సొసైటీ చైర్మన్ కన్నయ్య గారి హరికృష్ణ రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం నవతెలంగాణతొ మాట్లాడుతూ పత్తి రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్న కాపాస్ కిసాన్ యఫ్ ను వెంటనే తొలగించాలన్నారు. ఈ సంవత్సరం వర్షాకాలం ప్రారంభంలో వర్షాలు సరి గా పడకపోవడం విత్తనాలు రెండు, మూడు సార్లు నాటారని అన్నారు. అయిన విత్తనం సరిగా మొల వక ఎన్నో ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. అనంతరం అల్పపీడనం ఏర్పడి భారీగా వర్షాలు కురవడంతో మొదటిసారి విత్తనం నాటిన రైతుల కు పత్తి పంట దిగుబడి సరిగా రాక పూర్తిగా నష్ట పోయారన్నారు.

అన్ని ఆటుపోటులకు గురైన రైతు ఎన్నో వ్యయ ప్రాయాసాలకు ఓర్చి పంట పండిస్తే సీసీఐ పెట్టిన నిబంధనల వల్ల పంట అమ్ముకోలేక దిక్కుతోచని స్థితిలో రైతులు ఇబ్బం దులకు గురవుతున్నారని చెప్పారు. పంట అమ్ము కోవడానికి సీసీఐ నిబంధనల వల్ల రైతులు మరిన్ని నష్టాలు ఎదుర్కోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నా రు. కపాస్ కిసాన్ యాప్ లో ఏడు క్వింటాల్లా నిబం ధన విధించి రైతులను నట్టేట ముంచడం ఎంత వరకు సమంజమని ప్రశ్నించారు. రైతులకు పత్తి కొనుగోలు ఇబ్బందులు లేకుండా సీసీఐ నిబంధన లను తొలగించాలని, లేనియెడల రైతులతో కలిసి ధర్నాలు చేస్తామని హెచ్చరించారు. గతంలో ఎన్న డూ లేని నిబంధనలను రైతులకు నష్టం కలిగిస్తా యని ఇతవు పలికారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -