మహిళా కూలీల రాష్ట్ర కన్వీనర్ బి. పద్మ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల మహిళల హక్కులు రోజు,రోజుకు దిగజారుతున్నాయని మహిళా కూలీల రాష్ట్ర కన్వీనర్ బి పద్మ అన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యాయలంలో జరిగిన రాష్ట్ర వ్యవసాయ కార్మిక మహిళ కూలీల సమావేశంలో ఆమె మాట్లాడారు. దేశంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యధావిధిగా అమలు చేయాలన్నారు. కొత్తగా తెచ్చిన వీబీజీఆర్‌ఏఎంజీ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
మహిళలపై దాడులు, దౌర్జన్యాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో ప్రజా పంపిణీ, ఆహార భద్రతకు ప్రమాదముందన్నారు. శ్రమ జీవులకు కనీస వేతనాలు అమలు జరగడం లేదన్నారు. వ్యవసాయ మహిళ కూలీల హక్కుల సాధన కోసం మహిళ కార్మికులందరు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకట్రాములు, ఉపాధ్యక్షులు బి.ప్రసాద్,, నాయకులు, వినోద, లావాణ్య, నాగమణి, శారద, స్వరూప, శివలీల తదితరులు పాల్గొన్నారు.



