Wednesday, May 28, 2025
Homeరాష్ట్రీయంమావోయిస్టులతో కేంద్రం చర్చలు జరపాలి

మావోయిస్టులతో కేంద్రం చర్చలు జరపాలి

- Advertisement -

– తుపాకులతో సమస్య పరిష్కారం కాదు : సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె.నారాయణ
నవతెలంగాణ-చేవెళ్ల
మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపాలని, తుపాకుల వల్ల సమస్య పరిష్కారం కాదని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల కేంద్రంలోని శ్రీ సత్య సాయి గ్రామర్‌ హైస్కూల్‌లో జన సేవాదళ్‌ రాష్ట్రస్థాయి శిక్షణా తరగతులను ఆయన ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. మావోయిస్టులు లేకుండా చేస్తామని కేంద్ర హౌం మంత్రి అంటున్నారనీ, ఇది సాధ్యమయ్యే పని కాదని అన్నారు. పాకిస్తాన్‌ విషయంలో శాంతిని పాటించిన ప్రభుత్వం మావోయిస్టుల విషయంలో ఎందుకు ఖర్కశంగా వ్యవహరిస్తోందని ప్రశ్నించారు. నక్సలైట్లు కూడా ఈ దేశ పౌరులే అన్న విషయాన్ని గుర్తించాలన్నారు. రెండు వైపులా తుపాకులు వదిలి, శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. ఇప్పటికే శాంతి చర్చల విషయంపై మావోయిస్టుల నుంచి ఉత్తరం వచ్చిందని, దానిపై కేంద్రం స్పందించాలన్నారు. వెంటనే పీస్‌ కమిటీని ప్రకటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు భాగం హేమంతరావు, జనసేవ రాష్ట్ర కన్వీనర్‌ పంజాల రమేష్‌, నాయకులు గోశిక మోహన్‌, మోహన్‌ మారుపాక, అనిల్‌కుమార్‌, శంకర్‌, ఏఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి పుట్టా లక్ష్మణ్‌, ఏఐవైఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి కె.ధర్మేంద్ర, పార్టీ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య, రాష్ట్ర కంట్రోల్‌ కమిషన్‌ సభ్యులు పుస్తకాల నర్సింగరావు, రాష్ట్ర సమితి సభ్యులు పానుగంటి పర్వతాలు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -