Thursday, November 27, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఐసీడీఎస్‌ పరిరక్షణకు కేంద్రం నిధులు పెంచాలి

ఐసీడీఎస్‌ పరిరక్షణకు కేంద్రం నిధులు పెంచాలి

- Advertisement -

– నూతన జాతీయ విద్యా విధానం రద్దు చేయాలి : అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జయలక్ష్మి
– రాష్ట్ర మహాసభలో రెండో రోజు ప్రతినిధుల సభ
నవతెలంగాణ-ఆదిలాబాద్‌ ప్రాంతీయ ప్రతినిధి

ఐసీడీఎస్‌ పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం నిధులు పెంచాలని అంగన్వాడీ టీచర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జయలక్ష్మి డిమాండ్‌ చేశారు. తెలంగాణ అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ రాష్ట్ర 5వ మహాసభలో భాగంగా రెండో రోజు బుధవారం ఆదిలాబాద్‌ జిల్లా మావలలోని తిరుమల క్లాసిక్‌ గార్డెన్‌లో ప్రతినిధుల సభ జరిగింది. ముందుగా సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె.సునీత జెండా ఆవిష్కరణ చేసి అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు.యూనియన్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి ఏఆర్‌ సింధు, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ అమర వీరుల స్థూపానికి పూలమాలవేసి నివాళులర్పిం చారు. అమరవీరులకు రెండు నిమిషాలు మౌనం పాటించి సంతాపం తెలిపారు. అనంతరం ప్రతినిధుల సభను ప్రారంభిస్తూ పి.జయలక్ష్మి ఉపన్య సించారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ కు గ్రాట్యుటీ ఇవ్వాలని, 45వ ఇండియన్‌ లేబర్‌ కాన్ఫరెన్స్‌ సిఫారసుల ప్రకారం కార్మిక చట్టాల పరిధి లోకి తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. కేంద్రం తెచ్చిన నూతన జాతీయ విద్యా విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రైమరీ పీఎంశ్రీ మొబైల్‌ అంగన్వాడీ సెంటర్స్‌ పేరుతో ఐసీడీఎస్‌ను పూర్తిగా నిర్వీర్యం చేసే విధానాలను కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగు లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలని, అంగన్వాడీలను నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు. ఐసీడీఎస్‌ పరిరక్షణ, అంగ న్వాడీల హక్కుల సాధన, సమాన పనికి సమాన వేతనం ఇతర సమస్యలపై ఈ మహాసభలో చర్చించి తీర్మానాలు చేశారు.
సభలో యూనియన్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి ఏఆర్‌.సింధు, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌, సీఐటీయూ రాష్ట్ర కోశాధికారి మంగ, రాష్ట్ర కార్యదర్శి కూరపాటి రమేష్‌, శ్రామిక మహిళా రాష్ట్ర కన్వీనర్‌ రమ, త్రివేణి, వెంకటమ్మ, స్వప్న, విమలమ్మ, టీఏజీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూసం సచిన్‌, సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బొజ్జ ఆశన్న, అన్నమొళ్ల కిరణ్‌, నాయకులు లంక రాఘవులు, బండి దత్తాత్రి, దర్శనాల మల్లేష్‌ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -