Saturday, September 13, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంకేంద్రం విద్యుత్‌ బస్సుల విధానంలో మార్పులు చేయాలి

కేంద్రం విద్యుత్‌ బస్సుల విధానంలో మార్పులు చేయాలి

- Advertisement -

ఆర్టీసీలను రక్షించుకుందాం : బస్‌డిపోల ఎదుట ఎస్‌డబ్ల్యూఎఫ్‌ ‘సేవ్‌ ఆర్టీసీ’ ఆందోళనలు

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
కేంద్ర ప్రభుత్వం విద్యుత్‌ బస్సుల విధానంలో మార్పులు చేయాలని టీజీఎస్‌ఆర్టీసీ స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ (ఎస్‌డబ్ల్యూఎఫ్‌) డిమాండ్‌ చేసింది. ఆర్టీసీలే విద్యుత్‌ బస్సులు కొని, నిర్వహణ చేసేలా అవకాశాలు కల్పించాలనీ, దానికోసం అవసరమైన నిధులు ఇవ్వాలని కోరారు. ‘ఆర్టీసీలను రక్షించండి’ అనే స్లోగన్‌తో ఆలిండియా రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ (ఏఐఆర్‌టీడబ్ల్యూఎఫ్‌) ఇచ్చిన పిలుపులో భాగంగా ఎస్‌డబ్ల్యూఎఫ్‌ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారంనాడిక్కడి బస్‌భవన్‌, ఉప్పల్‌ వర్క్‌ షాప్‌, ఖమ్మం, వరంగల్‌, మహబూబ్‌నగర్‌, నల్లగొండ, కరీంనగర్‌ రీజియన్‌ డిపోల వద్ద ”ఆర్టీసీల పరిరక్షణ దినం” పాటించారు. ఈ సందర్భంగా కార్మికులు డిమాండు బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. డిపోల ఎదుట ‘సేవ్‌ ఆర్టీసీ’ బ్యానర్లు పట్టుకొని, కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బస్‌భవన్‌ వద్ద జరిగిన కార్యక్రమంలో ఎస్‌డబ్ల్యూఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్‌ రావు, ప్రచార కార్యదర్శి పీ రవీందర్‌రెడ్డి, ఎవి రావు హాజరై కార్మికులకు డిమాండ్‌ బాడ్జిలు పెట్టారు. ఉప్పల్‌ జోనల్‌ వర్క్‌ షాప్‌ గేటు దగ్గర జరిగిన కార్యక్రమంలో ఎస్‌డబ్ల్యూఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు వీరాంజనేయులు, కోశాధికారి కె సత్తిరెడ్డి హాజరయ్యారు.

ఖమ్మం డిపో వద్ద రాష్ట్ర కార్యదర్శి సుధాకర్‌, సూర్యాపేట డిపో వద్ద నల్గొండ రీజియన్‌ కార్యదర్శి బత్తుల సుధాకర్‌, మహబూబ్‌నగర్‌ డిపో వద్ద ప్రభాకర్‌, హైదరాబాద్‌ బర్కత్‌పుర డిపో వద్ద రాష్ట్ర ఉపాధ్యక్షులు కృష్ణ హాజరై కార్మికులకు డిమాండ్‌ బ్యాడ్జీలు పెట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కొత్త టెక్నాలజీతో ఆర్టీసీ గ్యారేజీలను అభివృద్ధి చేయాలనీ. బస్సుల నిర్వహణ, ఆదాయానికి మధ్య వచ్చే ఖర్చును ప్రభుత్వాలే భరించాలని కోరారు. అన్ని ఖాళీల్లో రెగ్యులర్‌ పోస్టులతో రిక్రూట్‌ మెంట్‌ చేయాలనీ, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ద్వారా డ్రైవర్‌, కండక్టర్ల రిక్రూట్‌మెంట్‌ను రద్దు చేసి, అన్ని కేటగిరీల కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పిం చాలని డిమాండ్‌ చేశారు. 2021, 2025 పెండింగ్‌ వేతన ఒప్పందాలను అమలు చేసి ఎరియర్స్‌ చెల్లించాలనీ, అలవెన్సుల్ని ఐదురెట్లు పెంచి అమలు చేయాలని కోరారు. ఉప్పల్‌ జోనల్‌ వర్క్‌ షాప్‌, స్క్రాప్‌ యూనిట్లను కరీంనగర్‌ వర్కుషాప్‌నకు బదిలీ చేయొద్దనీ, మియాపూర్‌ బస్‌ బాడీ యూనిట్‌ను అభివృద్ధి చేయాలనీ, ఆస్తుల నగదీకరణను వెంటనే నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -