బహుజన లెఫ్ట్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ డిమాండ్
నవతెలంగాణ – కంఠేశ్వర్
అకాల వర్షాలతో 20 వేల ఎస్థకరాల్లో పంటలు నష్టపోయి రైతాంగాన్ని, ఇళ్లు, వాహనాలు, ఆస్తులు కోల్పోయిన ప్రజలను కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఉత్తర తెలంగాణ ప్రజలను ఆదుకోవాలని బహుజన లెఫ్ట్ పార్టీ(బహుజన కమ్యూనిస్టు) బిఎల్పి రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ డిమాండ్ చేశారు. ఈ మేరకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్ లోగల బహుజన లెఫ్ట్ పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉత్తర తెలంగాణ జిల్లాలైన నిజామాబాద్,అదిలాబాద్, మెదక్, కరీంనగర్ పార్లమెంటలుగా, ఐదు, ఏడు, ఎమ్మెల్యేలు గెలిచిన తెలంగాణ బిజెపి ప్రజాప్రతినిధు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడంలో తగి హౌస్ హౌస్ న నిధులు మంజూరుకు కృషి చేయాలని డిమాండ్ చేశారు.
ప్రకృతి వైపరీత్యం వల్ల అకాల వర్షాలతో కామారెడ్డి,మెదక్, సిద్దిఢపేట, ,రాజన్న సిరిసిల్ల,నిర్మల్ తదితర ఉత్తర తెలంగాణ జిల్లాల పరిదిలో దాదాపు 20 వేల ఎకరాల్లో పంటలు నష్టపోయి రైతాంగాన్ని., ఇళ్లు , వాహనాలు, ఆస్తులు కోల్పోయిన ప్రజలను కేంద్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన వెంటనే 20 వేల కోట్ల రూపాయల గ్రాంట్ ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా విడుదల చేయాలని దండి వెంకట్ డిమాండ్ చేశారు. అదేవిధంగా భారీ వర్షాలతో ఉత్తర తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో దెబ్బతిన్న రోడ్లు, మంచినీటి సౌకర్యం, డ్రైనేజీ వ్యవస్థ, విద్యుత్ లైన్లు యుద్ధ ప్రాతిపదికన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం నిర్మించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో బహుజన లెఫ్ట్ పార్టీ బిఎల్ పి జిల్లా అధ్యక్షురాలు సబ్బని లత, జిల్లా నాయకులు వై.అనిల్ కుమార్, జిల్లా కమిటి సభ్యులు రాధా లు పాల్గొన్నారు.
భారీ వర్షాలతో నష్టపోయిన రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES