– కార్మికులు, ప్రజానీకానికి సచ్చేదిన్ : సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు
– మెదక్ జిల్లా కేంద్రంలో బడ్జెట్‌పై సెమినార్
నవతెలంగాణ-మెదక్ టౌన్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ సంపన్నులకే అచ్చేదిన్‌గా, కార్మిక వర్గానికి సచ్చేదిన్‌గా ఉందని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు అన్నారు. బుధవారం మెదక్ జిల్లా కేంద్రంలోని కేవల్ కిషన్ భవన్‌లో సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం ఆధ్వ ర్యంలో ‘కేంద్ర బడ్జెట్-వివిధ వర్గాలపై ప్రభావం’ అనే అంశంపై నిర్వహించిన సెమినార్‌లో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1వ తేదీన రూ.53,47,315 కోట్ల బడ్జెట్ ప్రవేశ పెట్టిం దన్నారు. ఈ బడ్జెట్‌లో దేశ ప్రజలకు గానీ, కార్మిక వర్గానికిగానీ, రైతులకు గానీ, వ్యవసాయ కార్మిక వర్గానికిగానీ ఏమాత్రం వర్తించేలా లేదని తెలి పారు. ఈ బడ్జెట్ దేశంలో సంపన్నులకు ఉపయో గకరంగా ఉందన్నారు. రాష్ట్రం నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నప్పటికీ రాష్ట్రానికి బడ్జెట్ తీసుకు రావడంలో విఫలమయ్యాయని తెలిపారు. రైల్వే, నీటి ప్రాజెక్టులకు బడ్జెట్ కేటాయింపులు లేవన్నారు. కేంద్రం ద్వారా అమలవుతున్న సంక్షేమ పథకాలకు సబ్సిడీలు తగ్గించిందని, దీనివల్ల పేద ప్రజలకు నష్టం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పిరేట్ కంపెనీలు కట్టే పన్నుల వాటా 18శాతం మాత్రమే ఉండగా అత్యధిక మధ్యతరగతి కట్టే ఆదాయపు పన్ను వాటా 21శాతం ఉంద న్నారు. స్కీమ్ వర్కర్లకు 2018 నుంచి కేంద్ర ప్రభు త్వం వేతనాలు పెంచడంలేదని, కార్మికులు, ఉద్యో గుల ప్రస్తావన బడ్జెట్‌లో రాలేదని విమర్శించారు. గ్రామీణ ఉపాధి హామీకి 2021-22లో రూ.380.04 కోట్లు ఉండగా, ఈ బడ్జెట్‌లో రూ.183.77 కోట్లకు తగ్గిందన్నారు. పెరుగుతున్న నిత్యావసరాల ధరలకు అనుకూలంగా జీతాలు పెంచడం లేదన్నారు. దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫ్లోర్ లెవెల్ మినిమం వెజ్ కార్మికునికి రోజుకి రూ.178 ఉంటే సరిపోతుందని చెప్పడం అన్యాయ మన్నారు. విద్యారంగానికి కేవలం 3 శాతం మాత్రమే కేటాయించిందని అన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం పునరాలోచించి బడ్జెట్‌ను సవరించి కేటాయింపులు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఏ.మల్లేశం, బాలమణి, కోశాధికారి నర్సమ్మ, జిల్లా ఉపాధ్యక్షులు మహేం దర్, నాగరాజు, సహాయ కార్యదర్శులు బస్వరాజు, గౌరయ్య, సంతోష్, అన్నపూర్ణ, నాగేందర్ రెడ్డి, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు లక్ష్మినారాయణ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కె.మల్లేశం, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర బడ్జెట్‌తో సంపన్నులకే అచ్ఛేదిన్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



