Thursday, January 15, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంస్థానిక సంస్థల బలోపేతానికి కేంద్రం కట్టుబడి ఉంది

స్థానిక సంస్థల బలోపేతానికి కేంద్రం కట్టుబడి ఉంది

- Advertisement -

ఇప్పటివరకు రూ. 11 వేల కోట్ల నిధులు విడుదల : కేంద్రమంత్రి జి. కిషన్‌రెడ్డి వెల్లడి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌

రాష్ట్రంలో గ్రామపంచాయతీలు, స్థానిక సంస్థల బలోపేతానికి నిధుల విడుదలకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకోవడం పట్ల కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. దశాబ్ద కాలంగా రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలు, స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం రూ.11వేల కోట్లకు పైగా నిధులను విడుదల చేసిందని ఈ మేరకు ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2015-16 నుంచి 2019-20 మధ్యలో కేంద్రం గ్రామ పంచాయతీలకు రూ.5,060 కోట్లు విడుదల చేయగా, 2020-21 నుంచి 2025-26 మధ్యలో ఈ కేటాయింపులు 80శాతం (రూ.9,050 కోట్లు) పెరిగాయని తెలిపారు. ఇందులో రూ.6,051 కోట్లను విడుదల చేసిందని పేర్కొన్నారు. గ్రామీణ స్థాయి నుంచి ప్రజాస్వామ్య సంస్థలను బలోపేతం చేయడం ద్వారా మారుమూల ప్రాంతాల వరకు కూడా జవాబుదారీతనం, పారదర్శకత పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఇందుకోసమే స్థానిక సంస్థలకు సంబంధించిన నిధులను మొదట నుంచి సమయానుగుణంగా విడుదల చేస్తుందని తెలిపారు. ఇటీవల తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మిగిలిన నిధులను కూడా త్వరలోనే విడుదల చేస్తుందని పేర్కొన్నారు. గ్రామాభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అన్ని ప్రయత్నాలకు సహకరిస్తూ గ్రామ పంచాయతీలు, గ్రామీణ ప్రాంతాల్లో మౌలికవసతుల కల్పనకు చొరవతీసుకోవాలని ఆయన కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -