సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు ప్రసాద్ డిమాండ్
నవతెలంగాణ – కంఠేశ్వర్
రైతాంగ సమస్యల పట్ల కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం విడనాడాలి అని సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు ప్రసాద్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం సీపీఐ(ఎం) జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు బుర్రి ప్రసాద్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం నాకు కావలసిన ఎరువులను సరిపడా సరఫరా చేయకపోవడంతో యూరియా తదితర ఎరువుల కొరకు ఫర్టిలైజర్ షాపుల ముందు ఎదురుచూడాల్సి వస్తుందని ఆయన అన్నారు. ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ఉండగా కేవలం లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా చేయటంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఫలితంగా తమ పంటలను కాపాడుకోవడానికి ప్రయివేటును ఆశ్రయించే పరిస్థితి వస్తుందని, బ్లాక్ మార్కెట్లో మధ్య తరగతి రైతులు కొనుగోలు చేయలేక ఇబ్బంది పడుతున్నారని ఆయన విమర్శించారు.
రాష్ట్రం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు, నిజామాబాద్ జిల్లా పార్లమెంట్ సభ్యులు కొడతాను తీర్చటానికి వెంటనే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలని ఆయన కోరారు. అదేవిధంగా రాష్ట్రప్రభుత్వం హలో మంది రైతుల యొక్క రుణాలను మాఫీ చేయకపోవడంతో అధికారుల చుట్టూ ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ నాయకుల చుట్టూ తిరిగి ఇబ్బందులు పడుతున్నారని వెంటనే ప్రభుత్వం రైతులందరికీ రుణాలను మాఫీ చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు రైతులను ప్రజలను మభ్యపెట్టి తమ రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే ఆలోచిస్తున్నారు తప్ప, రైతుల సమస్యలను పట్టించుకోవటం లేదని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు, కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకట్ రాములు, నూర్జహాన్, పి వెంకటేష్, జిల్లా కమిటీ సభ్యులు కొండ గంగాధర్, నన్నే సాబ్, జంగం గంగాధర్, సుజాత, వేషాల గంగాధర్, విగ్నేష్ తదితరులు పాల్గొన్నారు.
రైతాంగం సమస్యల పట్ల కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వీడనాడాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES