Friday, August 22, 2025
E-PAPER
spot_img
Homeఆదిలాబాద్పల్లెల అభివృద్ధే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే

పల్లెల అభివృద్ధే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే

- Advertisement -

నవతెలంగాణ – మధోల్
పల్లెల అభివృద్ధి కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటెల్ అన్నారు. నియోజకవర్గ కేంద్రమైన ముధోల్ లో  పనుల జాతర కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేయడం,  అభివృద్ధిలో అంకితభావంతో ప్రజలను భాగస్వామ్యం చేయడం ఈ కార్యక్రమం ఉద్దేశమన్నారు. గ్రామీణ ప్రాంతాలలో నిరుపేద కూలీ కుటుంబాల జీవనోపాధిని మెరుగుపరచడం, ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం 100 రోజుల కూలీ పని దినాలను కల్పించడం ఉపాధి హామీ పథకంలో భాగం అని తెలిపారు.

ముధోల్లోని  సాయిమాధవ్ నగర్ కాలనీలో ఎన్ఆర్ఈజీఎస్ నిధులు రూ.40 లక్షలతో  నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లు, మురికి కాలువలను ప్రారంభించారు . ఆనంతరం ముధోల్ నుండి రువ్వి గ్రామానికి వెళ్లే రోడ్డు రైతులకు రవాణా సౌకర్యార్థం రూ.9 లక్షల నిధులతో గ్రావెల్ రోడ్డు పనులను ప్రారంభించారు. అలాగే తాసిల్దార్ కార్యాలయం నందు రూ.3 లక్షల నిధులతో  పబ్లిక్ టాయిలెట్స్ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. శివాజీ చౌక్ నుండి పెట్రోల్ బాంక్  వరకు సుమారు రూ. 1.5 కిలోమీటర్ల వరకు  మరమ్మత్తుల పనులనుప్రారంభించారు. నియోజవర్గంలోని అన్ని గ్రామాలలో నెలకొన్న సమస్యలను  వరకు దశలవారిగా పరిష్కరిస్తామని తెలిపారు. నియోజవర్గ అభివృద్ధి లక్ష్యంతో ముందుకెళ్తున్నట్లు చెప్పారు .

ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి సుదర్శన్, పీ ఆర్ ఈఈ చందు జాదవ్,డీ ఈఈ కమలాకర్, తాసిల్దార్ శ్రీలత, ఏపీవో శిరీష రెడ్డి, సూపర్డెంట్ అశోక్, బిజేపి మండల అధ్యక్షుడు కోరి పోతన్న, బిడిసి అధ్యక్షుడు విఠల్, నాయకులు నర్సగౌడ్ ,సతీష్ రెడ్డి,తాటివార్ రమెష్ ,ముత్యం రెడ్డి,  లక్ష్మి నారాయణ, ధర్మపురి సుదర్శన్, సప్పటోల్ల పోతన్న, జీవన్, మోహన్ , సాయినాథ్, సంతోష్,  విట్టల్ రావు ,  గ్రామస్తులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad