Sunday, September 7, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్విదేశీ పత్తి దిగుమతుల పై కేంద్ర ప్రభుత్వ సుంకాల తగ్గింపును ఉపసంహరించుకోవాలి

విదేశీ పత్తి దిగుమతుల పై కేంద్ర ప్రభుత్వ సుంకాల తగ్గింపును ఉపసంహరించుకోవాలి

- Advertisement -

తెలంగాణ రైతు సంఘం, సీఐటీయూ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, ఆద్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దగ్దం
నవతెలంగాణ – కంఠేశ్వర్ 

విదేశీ పత్తి దిగుమతుల పై కేంద్ర ప్రభుత్వ సుంకాల తగ్గింపును ఉపసంహరించుకోవాలి తెలంగాణ రైతు సంఘం, సీఐటీయూ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘలా నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం నిజామాబాద్ జిల్లా కేంద్రం ఎన్టీర్ చౌరస్తా లో కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దగ్దం చేశారు. అనతరం తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి పల్లపు వెంకటేష్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి నుర్జహాన్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పెద్ది వెంకట్ రాములు మాట్లాడుతూ.. కేంద్రంలోని బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వం స్వదేశీ పత్తి రైతులను నట్టేట ముంచడానికి పూనుకున్నదని విదేశీ పత్తి దిగుమతుల సుంకాలను 11% తగ్గించడానినీ,సుంకాల తగ్గింపులు వెంటనే విరమించుకోవాలని డిమాండు చేశారు.

 స్వదేశీ పత్తి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే పత్తి పంటకు గిట్టుబాటు ధర లేక నష్టపోతు ఆత్మహత్యల పాలవుతున్నారని ఈ పత్తి రైతులను మరింత ప్రమాదంలోకి నెట్టే విధంగా అనుసరిస్తున్న బిజెపి ప్రభుత్వ విధానాలను రైతులంతా ఖండించాలని పిలుపునివ్వడం జరిగింది. వెంటనే బిజెపి మోడీ ప్రభుత్వం దిగుమతి సుంకాలను 50 శాతానికి పెంచాలని, పత్తి పంటకు గిట్టుబాటు ధర రూ.10 వేల 75 చెల్లించాలని డిమాండ్ చేశారు.

స్వామి నదన్ కమిషన్ తీరుపు ప్రకారం రైతులకు గిట్టుబాటు ధర c+2 ప్రకారం ధర కల్పించాలని డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించే పోరాటాలకు రైతులు మద్దతు తెలుపుతూ పార్టీలకతీతంగా పాల్గొని మోడీ అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని రైతులంతా ఏకం కావాలని పిలుపునివ్వడం జరిగింది. ఎప్పటి కే పత్తి పంట కు రూ.200 తగ్గింది అన్నారు. వరద ప్రభావ ప్రాంతాలకు కేంద్రము ప్రత్యేక విపత్తు కింద నిధులు కేటాయించి రైతులను ఆదుకోవాలని అన్నారు రైతులు 2014 నుండి ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబ లను అదుకొని విత్తనాలు, మందులు యంత్రాలు కు తీసుకున్న రుణాలను, మైక్రో ఫైనాన్స్ అప్పులను రద్దు చేయాలని అన్నారు ఉపాధి హామీ పనికి 200 ల రోజులు పని కల్పించి రోజు కూలీ 600 ఇవ్వాలని అన్నారు కేంద్రము నిధులు కేటాయించి పని కొన సాగే విధంగా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బార్ధన్, రాములు, ఎస్ కే అబ్దుల్ విఘ్నేష్, రాజు చక్రి ఆజాద్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad