Friday, May 2, 2025
Homeతెలంగాణ రౌండప్రాహుల్ గాంధీ ఆలోచన అనుసరించిన కేంద్రం

రాహుల్ గాంధీ ఆలోచన అనుసరించిన కేంద్రం

జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి
నవతెలంగాణ – కంఠేశ్వర్ 

రాహుల్ గాంధీ ఆలోచన ను కేంద్ర ప్రభుత్వం అనుసరించిందని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి అన్నారు. ఈ మేరకు గురువారం నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహేర్ బిన్ హందాన్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. నిన్నటి రోజు జనగణనలో భాగంగా కుల గణన కూడా చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తీరు అభినందనియం అని, దేశంలో కులగణనకు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవడం అనేది కేద్రంపై ఒత్తిడి తెచ్చిన నాయకులు రాహుల్ గాంధీకే ఈ ఘనత దక్కుతుంది అని అన్నారు. సంపన్నుల కంటే పెదవారి కోసం ఎక్కువ ఆలోచన ఉన్న వ్యక్తి రాహుల్ గాంధీ అన్నారు. కులగణన చేసే ప్రక్రియలో అన్ని వర్గాల వారి ఆలోచన తీసుకొని దానికి అన్ని రకాలుగా సబ్ కమిటీ ఏర్పాటు చేసి వేలాది మంది నిర్ణయాలు తీసుకొని కులగణన చేసిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమన్నారు.
అందుకే రాహుల్ గాంధీ దేశంలో కులగణన చేసే ప్రక్రియలో తెలంగాణను రోల్ మోడల్ గా తీసుకోవాలని చెప్పడం జరిగిందనీ, దేశానికే రాష్ట్రాన్ని రోల్ మోడల్ గా చేసిన రేవంత్ రెడ్డికి సహచర మంత్రి వర్గానికి కృతజ్ఞతఃలు తెలుపుతున్నమ్మనారు. దేశం మొత్తం కులగణన జరగాలని కేంద్రంపై ఒత్తిడి తెచ్చి, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కచ్చితంగా కులగణనా చేసి తీరుతామని చెప్పిన రాహుల్ గాంధీ ఆలోచన ప్రకారం కామారెడ్డి డిక్లరేషన్ లో చెప్పిన విధంగా రాహుల్ గాంధీ ఆలోచన మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన సహచర మంత్రివర్గం తెలంగాణ రాష్ట్రంలో విజయవంతంగా కులగణన పూర్తి చేయడం జరిగిందని అన్నారు.అందుకే కేంద్ర ప్రభుత్వం కులగణన చేసే ప్రక్రియలో తెలంగాణూ రోల్ మోడల్ గా తీసుకోవాలని రాహుల్ గాంధీ చెప్పడం జరిగిందనీ,దేశం మొత్తం కులగణన అమలు చేయడం అనేది రాహుల్ గాంధీ దేశ ప్రజల విజయమని మానాల మోహన్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి,రాష్ట్ర ప్రచార కమిటీ మెంబర్ జావిద్ అక్రమ్,సీనియర్ కాంగ్రెస్ నాయకులు రత్నాకర్,జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విపుల్ గౌడ్,జిల్లా ఓబీసీ అధ్యక్షులు నరేందర్ గౌడ్, జిల్లా సేవాదళ్ అధ్యక్షులు సంతోష్,జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షులు యాదగిరి,సాయి కిరణ్,శివ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img